కండోమ్.. హంత‌కుడ్ని ప‌ట్టించింది

కండోమ్.. హంత‌కుడ్ని ప‌ట్టించింది.. ఎలాగో మీరే చ‌ద‌వండి.. ఒక చిన్నారిపై జరిగిన లైంగిక దాడి , హత్య విషయం లో పోలీసుల అన్వేషణ ఫలించింది. ముప్పై ఏళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత నేరస్థుడు ఉపయోగించిన కండోమ్‌ నేరస్థుడిని పట్టించింది. 1988 లో అతి కిరాతకం గా 8 ఏళ్ళ చిన్నారి పై అత్యాచారం చేసి పాశవికం గా చిత్ర హింసలకు గురి చేసి ముక్కలు ముక్కలుగా చిన్నారి శరీరాన్ని చిద్రం చేసి హత్య చేసిన ఆ కరడుగట్టిన సైకో చివరకు కటకటాల పాలయ్యాడు.

ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్యచేశాడో మానవ మృగం. ముప్పై ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఈ సైకో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆడుకుంటున్న తన కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాపు చేపట్టగా ఇటీవల ఓ కండోమ్ ద్వారా దుండగుణ్ని పట్టుకోగలిగారు. ఇండియానా రాష్ట్రం, ఫోర్ట్‌ వైనే నగరంలో 1988, ఏప్రిల్‌ 1న 8 ఏళ్ల చిన్నారి ‘ఏప్రిల్‌ టిన్‌స్లే’ అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. మూడు రోజుల తర్వాత అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహం ముక్కలై పడి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో చిన్నారిని లైంగికదాడి చేసి, ఆపై చిత్రవధ చేసి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు మాత్రం పోలీసులకు సవాల్‌ విసురుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో 1990లో నగరంలోని ఓ గోడ మీద..‘ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని చంపింది నేనే. ఆ పాపా ఇంకో షూ మీకు దొరికిందా?.. హహ.. మళ్లీ చంపేస్తా’ అంటూ రాతలు కనిపించాయి. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. సుమారు 30 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. తర్వాత ఇద్దరు స్థానికులకు లేఖ రాశాడు. ఓ ప్రాంతంలో కండోములు ఉన్నాయని, వాటి వాడిన వ్యక్తే హత్య చేశారని అందులో ఉంది. దీంతో పోలీసులు ఆ కండోములను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జన్యుశాస్త్రవేత్త సాయంతో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వంశవృక్షాలను అధ్యయనం చేసే జెనాలజీని ఆశ్రయించారు. జెనాలజీని విశ్లేషించిన పోలీసులకు గ్రాబిల్‌కు చెందిన జాన్ మిల్లర్ (59), అతని సోదరుడిపై అనుమానం వచ్చింది. మిల్లర్ ఇంటి డస్ట్ బిన్‌లో అధికారులకు కండోమ్‌లు దొరికాయి. అత్యాచారానికి వినియోగించిన కండోమ్‌లోని స్పెర్మ్, మిల్లర్ ఇంటి డస్ట్ బిన్ లో దొరికిన కండోమ్‌ లోని స్పెర్మ్ రెండూ జేనాలజీ పరీక్ష లో ఒకటే కావటం తో వాటి పరీక్షల అనంతరం నిందితుడు మిల్లరే అని పోలీసులు నిర్ధారించి, అతన్ని అరెస్ట్ చేశారు. నేరాన్ని ఒప్పుకున్న మిల్లర్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

American Latest News, American Breaking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *