నోకియా నుంచి ఫీచర్ ఫోన్

Nokia Launched New smart Phone
  • కొత్త హంగులతో నోకియా 106 విడుదల

స్మార్ట్ ఫోన్ల ప్రస్తుత ప్రపంచంలో మొబైల్ దిగ్గజం నోకియా ఫీచర్ ఫోన్ పీచర్ ఫోన్ పై దృష్టి సారించింది. తన పాపులర్ మోడల్ ఫీచర్ ఫోన్ ను మళ్లీ లాంచ్ చేసింది. నోకియా 106 మోడల్ ను రష్యాలో తాజాగా విడుదల చేసింది. 2013లో విడుదలై బహుళ ఆదరణ పొందిన ఈ ఫోన్ కు మరిన్ని హంగులు చేర్చి లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఫోన్ లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 15గంటల టాక్‌ టైం 21 గంటల స్టాండ్‌ బై తమ ఫీచర్‌ ఫోన్‌ సొంతమని పేర్కొంది. ఈ ఫోన్ ధర రూ.1750 వరకు ఉండనుంది. 2013లో దీని ధర రూ.1399 కాగా, ప్రస్తుతం రూ.350 మేర పెరిగింది. అయితే, ఈ ఫోన్ ను భారత్ లో సహా మిగిలిన దేశాల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే అంశంపై కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

నోకియా 106 ఫీచర్లు ఇవీ…
1.8ఇంచెస్‌డిస్‌ప్లే
మీడియా టెక్‌ ఎంటీ 6261 డీ ప్రాసెసర్‌
4 ఎంబీ ర్యామ్‌, 4 ఎంబీ స్టోరేజ్‌
ఎఫ్‌ఎం రేడియో, ఎల్‌ఈడీ  ఫ్లాష్‌ లైట్‌
800ఎంఏహెచ్‌ బ్యాటరీ

More Nokia Mobile NewsYOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *