అవ‌గాహ‌న లేకుండానే కొన్నారు పిచ్చోళ్లు..

మాదాపూర్‌లో ల‌క్ష‌న్న‌ర‌కు ప్లాటు అమ్ముడైంద‌ని.. ఎవ‌రైనా అదే ఏరియాలో ఇత‌ర ప్లాట్ల‌నూ అదే రేటుకు అమ్మాల‌ని చూస్తే ఎట్టి ప‌రిస్థితిలో కొన‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఎవ‌రో ఒక‌రు ఆ ధ‌ర‌కు ప్లాటు కొన్నార‌ని.. అదే రేటుకు మిగ‌తా ప్లాట్లు అమ్ముతానంటే అస్స‌లు అంగీక‌రించొద్ద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే, హెచ్ఎండీఏ నిర్వ‌హించిన వేలం పాట‌లో ప‌లికిన ధ‌రే.. మార్కెట్‌కు ప్రామాణికం కాదు. పైగా, ఒక‌ట్రెండు ప్లాట్ల‌ను కొనుక్కున్న‌వారు ఇక్క‌డి స్థానికులు కాదు. ఎన్ఆర్ఐలు. వారికి ఇక్క‌డి మార్కెట్ మీద అవ‌గాహ‌న ఉండ‌దు. హెచ్ఎండీఏ అమ్ముతుంటే.. అంతా ప‌క్కాగా ఉంటుంద‌ని అనుకుంటారే త‌ప్ప‌.. ధ‌ర గురించి పెద్ద‌గా ఆలోచించ‌రు. అయితే, ఇలాంటివారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌నిపించే ఇలాంటి పోక‌డ‌ల‌నే మ‌ళ్లీ తెలంగాణ ప్ర‌భుత్వం హ‌యంలో క‌నిపిస్తుంద‌ని.. స్థ‌లాల ధ‌ర‌లను అనూహ్యంగా పెంచేస్తున్నార‌ని సామాన్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అమీన్‌పూర్‌, బాచుప‌ల్లి వంటి ప్రాంతాల్లో గజం ధ‌ర ఇర‌వై వేల‌కు అటుఇటుగా ఉండేది. ఇప్పుడు 35, 36 వేలు అయ్యింది. ఒక్క‌సారిగా పెరిగిన ఈ ధ‌ర వ‌ల్ల.. మ‌ళ్లీ కొనేవారు పెద్ద‌గా ఉండ‌రు. పైగా, బాచుప‌ల్లిలో నివ‌సించ‌డానికి అనుకూల‌మైన ప‌రిస్థితులు లేవు. అక్క‌డి చుట్టుప‌క్క‌ల ఉన్న ప‌రిశ్ర‌మ‌ల నుంచి రాత్రి కాగానే ర‌సాయ‌న‌క విష‌వాయువులు విడుద‌ల అవుతుంటాయి. కొన్నిసార్లు ఉద‌యం నుంచే వ‌చ్చే ఆ ఘాటైన వాస‌న‌ల‌ను భ‌రించ‌లేక స్థానికులు ఉక్కిరిబిక్క‌రి అవుతుంటారు. అమీన్‌పూర్‌లో కూడా అదే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ఇవ‌న్నీ గ‌మ‌నించ‌కుండానే.. అంతంత ధ‌ర పెట్టి ప్లాట్ల‌ను చాలామంది కొనుగోలు చేశారు. అస్త‌వ్య‌స్తంగా కొన్న ప్లాట్ల‌ను కొన్న‌వారి చూసి జనాలు తెగ న‌వ్వుకుంటున్నారు. వీరికి డ‌బ్బులు ఎక్కువ‌య్యాయ‌ని సెటైర్లు వేస్తున్నారు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *