బామ్మ గారు స‌ర్జ‌రీ చేయించుకోర‌ట‌!

వ‌య‌స్సు అయిపోతున్నా వార్త‌ల్లో నిలిచేది కొంద‌రే..
వ‌ర్ఛ‌స్సు త‌గ్గిపోతున్నా మాట నిలబెట్టుకోవాల‌న్న త‌ప‌న కొంద‌రిదే
ఈ క్ర‌మంలోని వారే బ్రిట‌న్ మ‌హారాణి క్వీన్ ఎలిజ‌బెత్
……………………………………………………………….
ఇటీవ‌ల మ‌న‌వ‌డి పెళ్లి సంద‌డి చూసి ముచ్చ‌ట ప‌డిపోయిన ఈ పెద్దామెకు ఇప్పుడొక స‌మ‌స్య వ‌చ్చి ప‌డింద‌ట‌! వ‌య‌సు మీద పడుతుండ‌డంతో మోకాలి నొప్పులు విపరీతంగా వస్తున్నాయ‌ట‌! కానీ వీటి నివార‌ణ స‌ర్జ‌రీ చేయించుకోమంటే మాత్రం కాద‌ని చెబుతున్నార‌ట‌! ఆ మ‌ధ్య కంటి ఆప‌రేష‌న్ చేయించుకుని  ఆ విష‌యం బ‌య‌ట‌కు వెల్ల‌డి కాకుండా క‌ళ్ల‌ద్దాలు ధ‌రిస్తున్న ఈ యువ‌రాణి స‌ర్జ‌రీ పేరుతో ఇచ్చే కొద్ది పాటి విశ్రాంతి వ‌ల‌న తాను రాజ‌ప్రాసాదంలో జ‌రిగే చిన్న చిన్న శుభ‌కార్యాల‌ను సైతం మిస్ అవుతాన‌ని,అది త‌న‌కు ఇష్టం లేద‌ని అంటున్నారీమె.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *