వివాహేతర సంబంధం హ‌త్య‌ల్లో ముందంజ‌

సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు వంటి భారతదేశంలో వివాహానికి ఉన్న పవిత్రత చాలా ఎక్కువ. అయితే ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోవడమే కాక, వాటివల్ల జరిగే నేరాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తదనం కోసమో, జీవిత భాగస్వామి దగ్గర సరైన సుఖం దొరకడలేదనో, ఇలా పలు కారణాలతో బయటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేవారి సంఖ్య పెరుగుతోందని ఇటీవల పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది ఇక్కడితో ఆగిపోకుండా హత్యల వరకు వెళుతున్నాయి. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్త లేదా భార్యను హతమారుస్తున్న సంఘటనలు ఇటీవల బాగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా ఉన్న 400కు పైగా ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న లక్షలాది విడాకుల కేసుల్లో 20 శాతం కేసులకు వివాహేతర సంబంధాలే మూలం. అంతేకాకుండా వివాహేతర సంబంధాల కారణంగా అధికంగా హత్యలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో – తెలంగాణ 4వ స్థానంలో వున్నాయి. 2015 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 1099 హత్యలు జరిగాయి. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా 198 హత్యలు జరగ్గా, తెలంగాణలో 156 సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధంపై కేంద్రం కీలకమైన నిర్ణయాన్ని వెలువరించింది. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం కచ్చితంగా శిక్షార్హమైన నేరమేనని స్పష్టంచేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మన వివాహ వ్యవస్థకు ఉన్న పవిత్రను కాపాడాలంటే ఆ నేరానికి పాల్పడేవారికి శిక్ష విధించాల్సిందేనని పేర్కొంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కాకుండా మహిళను కూడా శిక్షించాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం తన వాదనలు వినిపిస్తోంది. ఐపీసీలోని సెక్షన్ 497-198(2)ను రద్దు చేస్తే భారతీయ మూలాలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇలా చేయడం వల్ల భారతీయ వివాహ వ్యవస్థ ప్రాముఖ్యత కూడా తగ్గే ప్రమాదం ఉందని వివరించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అయితే, దీని ప్రకారం కేవలం పురుషుడు మాత్రమే నేరస్తుడని, అందుకు పాల్పడిన మహిళ మాత్రం బాధితురాలిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కూడా నేరస్తురాలే అని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. త్వరలోనే ఈ అంశంపై తీర్పు వెలువడనుంది.

Family Issues, Family News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *