హైద‌రాబాద్‌లో కంట్రీసైడ్ విల్లాస్

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు ముప్ప‌య్ ఐదేళ్ల‌కు పైగా అనుభ‌వం గ‌ల గౌత‌మీ డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ‌.. న‌గ‌రంలో ప్ర‌ప్ర‌థ‌మంగా కంట్రీసైడ్ విల్లాస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట్ నుంచి శంక‌ర్‌ప‌ల్లి రూటులో.. ఇక్ఫాయ్ కాలేజీ దాటిన త‌ర్వాత.. వ‌న్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్‌లో.. దాదాపు 11 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తోంది. ఇందులో వ‌చ్చేవ‌న్నీ ఖ‌రీదైన ల‌గ్జ‌రీ విల్లాలే. ఒక్కో విల్లా విస్తీర్ణం 750 గ‌జాల నుంచి 1100 గ‌జాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నిర్మాణం కేవ‌లం 25 శాతం స్థ‌లంలోనే జ‌రుపుతారు. మిగతా డెబ్బ‌య్ శాతం గ్రీన‌రీకే వ‌దిలేస్తారు. ట్రిప్లెక్స్ త‌ర‌హాలో డెవ‌ల‌ప్ చేస్తోన్న ఒక్కో విల్లా ప‌న్నెండు ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ప్ర‌తి తలుపు ఎనిమిది ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విల్లాలు ఐదు బెడ్‌రూముల‌వి కావ‌డం విశేషం. విలాస‌వంత‌మైన ఈ విల్లా ప్రాజెక్టులో హోమ్ థియేట‌ర్‌, డ‌బుల్ హైట్ సీలింగ్‌, సెప‌రేట్‌గా డ్రై కిచెన్‌, వెట్ కిచెన్ వంటివి డెవ‌ల‌ప్ చేస్తారు. ప్ర‌తి ఫ్లాటుకు ప్ర‌త్యేకంగా లిఫ్టు సౌక‌ర్యం కూడా ఉంటుంది. ప‌ని మ‌నుష్యుల కోసం విడిగా స‌ర్వెంట్ క్వార్ట‌ర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎలివేష‌న్ కాంటెప‌ర‌రీ స్ట‌యిల్‌కి ఏమాత్రం తీసిపోన‌ట్లుగా ఉంటుంది. చుట్టుప‌క్క‌ల ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌టిప‌రిస‌రాలే ద‌ర్శ‌న‌మిచ్చేలా డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఇప్ప‌టికే 23 విల్లాల నిర్మాణం య‌మ‌జోరుగా జ‌రుగుతోంది. సివిల్ ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి ఈ ప్రాజెక్టును ఏడాదిన్న‌ర‌లోపు అంద‌జేస్తారు. ఇంటింటికి మ‌ధ్య ఖాళీ స్థ‌లం భారీగా ఉండ‌టం వ‌ల్ల గాలీ, వెలుతురు ధారాళంగా ప్ర‌స‌రిస్తుంది. ట్రాఫిక్ ర‌ణ‌గొణ‌ధ్వ‌నుల‌కు కాస్త దూరంగా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఆధునిక జీవ‌న విధానాన్ని కోరుకునేవారికి హండ్రెడ్ ప‌ర్సంట్ ప‌క్కాగా సూట్ అవుతుందీ ప్రాజెక్టు.

Hyderabad Latest Properties News

Hyderabad New Properties List

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *