డేటింగ్ వెబ్ సైట్లతో 150 కోట్ల చీటింగ్

150cr cheating with dating websites
మనుషుల బలహీనతే వారి పెట్టుబడి. డేటింగ్ వెబ్ సైట్ల పేరుతో చీటింగ్ చేసి ఏకంగా 150 కోట్ల రూపాయలు లూటీ చేశారాటే వారెంత కిలాడీలో అర్ధం చేసుకోవచ్చు. విలాసాల కోసం ప్రారంభించిన డేటింగ్ సైట్లు కోట్ల రూపాయల వర్షం కురిపించటంతో 20 కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి మరీ బూతు భాగోతానికి తెర లేపారు ఈ పశ్చిమ బెంగాల్ కు చెందిన కేటుగాళ్ళు. మొత్తానికి లక్షల మంది జనం వీళ్ళ మాయలో నిలువు దోపిడీ ఇచ్చుకున్నాక ఇప్పుడీ మాఫియా పోలీసులకు చిక్కింది. డేటింగ్ వెబ్ సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. అక్ర‌మ‌మార్గంలో ద‌నార్జ‌న‌కు పాల్ప‌డ్డ‌ న‌లుగురు నిందితులు  గూగుల్ లో అంద‌మైన అమ్మాయిల ఫోటోల‌తో రూ.150కోట్లకు లూటీ చేశారు.    పశ్చిమ బెంగాల్ కు చెందిన దేబషీష్ ముఖర్జీ ప్రధాన సూత్రధారిగా.. తన అనుచరులు ఫైజుల్ హక్ అలి, అనితా దే, సందీప్ మిత్రా, నీతా శంకర్ లు విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డ్డారు. అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించాల‌నే ఉద్దేశంతో డేటింగ్ వెబ్ సైట్ల‌ను అస్త్రంగా మార్చుకున్నారు.

దేశ‌వ్యాప్తంగా 20కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి యువ‌త‌ను బూతులోకంలో విహ‌రించేలా చేస్తున్నారు. అలా రెండేళ్ల‌లో రూ.150కోట్ల లూటీకి పాల్ప‌డ్డారు. ఆ 20కాల్ సెంటర్ల‌లో మ‌హిళా ఉద్యోగ‌లతో క‌ష్ట‌మ‌ర్ల‌కు మాయ‌మాటలు చెప్పించేవారు. గూగుల్ లో దొరికిన అంద‌మైన ఫోటోల్ని క‌ష్ట‌మ‌ర్ల‌కు పంపించి శృంగార లోకంలో విహ‌రించేలా మాట్లాడేవారు. ఆ మాట‌ల‌కు లొంగిపోయిన బాధితులు ఆ వెబ్ సైట్ల‌లో లాగిన్ అయ్యేవారు.అంతే లాగిన్ అయిన వారికి మ‌హిళా ఉద్యోగులు ఫోన్ చేసి మీకు పంపిన ఫోటోల్లో మీరు కోరుకున్న అమ్మాయిల‌తో  ఏ స‌ర్వీస్ కావాల‌న్నా చేస్తారంటూ తియ్య‌ని గొంతుతో ప‌ల‌క‌రిస్తారు. అలా బాధితుడు వారి మాయలో పడగానే సభ్యత్వం నమోదు పేరుతో ఫీజులు అంటూ లక్షల్లో వసూలు చేస్తారు. ఇలా బాధితుడు నుంచి పూర్తిగా కొల్లగొట్టిన తర్వాత అతని ఫోన్ కు స్పందించడం మానేస్తారు. ఇలా దేశ వ్యాప్తంగా 3వెబ్ సైట్ల‌తో రూ.150కోట్ల‌కు పైగా మోసం చేసిన ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

150cr cheating with dating websites,hackers targets youth,20call centers for youth,150cr scam in cheating and dating websites,websites dating,online dating impacts,telugu latest news,today updates,technology latest updates,police should action on dating websites

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *