సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `2.0` ట్రైల‌ర్

2.0 Movie Trailer
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. న‌వంబ‌ర్ 3న ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళం, హిందీల్లో విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లోనే 25 మిలియ‌న్ పైగా డిజిట‌ల్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది.
త‌మిళంలో 8 మిలియ‌న్ ప్రేక్ష‌కులు, హిందీలో 10 మిలియ‌న్ పైగా వీక్ష‌కులు, తెలుగులో దాదాపు నాలుగు మిలియ‌న్ ప్రేక్ష‌కులు ఈ ట్రైల‌ర్ను చూశారు. మొత్తంగా అన్ని సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో క‌లిపి 25 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కాయి.

2.0 Movie Trailer , Telugu Latest Movie 2.0 , Rajinikanth with Shanker direction New Movie 2.0 Trailer, Telugu Movie, Aksay Kumar  , Releasing November 29 .

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *