టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన ఏబీసీ సి ఓటర్ సర్వే

abp-c voter survey shocks trs

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో  రాజ‌కీయ వాతావ‌ర‌ణం రంజుగా సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో ముందుస్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో టీఆర్ఎస్- మ‌హాకూట‌మి మ‌ధ్య పోటీ యుద్ధాన్ని త‌ల‌పించేలా ఉన్నాయి. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ ఇప్ప‌టికే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే 105 మంది అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక మిగ‌తా వారిని రెండు మూడు రోజుల్లో ఫైన‌ల్ చేయ‌నున్నార‌ని సమాచారం. ఇక మ‌రోవైపు మ‌హాకూట‌మి సీట్ల విష‌యంలో లొల్లి ఇంకా జ‌రుగుతూనే ఉంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా విడుద‌ల అయిన స‌ర్వే రిజ‌ల్ట్స్ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి.

   ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఏబీపీ-సీ ఓటర్ సర్వే షాకిచ్చింది. డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని.. మహాకూటమి విజయం ఖాయ‌మ‌ని ఏబీపీ-సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌డంతో తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయ‌ని.. రాహుల్‌తో- బాబు భేటీ మ‌హాకూట‌మికి బాగా క‌లిసి వ‌చ్చింద‌ని దీంతో మొన్న‌టివ‌ర‌కు గెలుపు శాతం టీఆర్ఎస్ వైపు ఉండ‌గా.. ఇప్పుడు మ‌హాకూట‌మి వైపు ట‌ర్న్ తీసుకుంద‌ని ఆ సర్వే తేల్చేసింది. ఇక ఆ స‌ర్వే ఇచ్చిన రిజ‌ల్ట్ చూస్తే.. మ‌హాకూట‌మి(కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్)కి 64 స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని.. టీఆర్ఎస్ 42 స్థానాల‌తో రెండ‌వ స్థానంలో నిలిచి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటుంద‌ని సీ ఓటర్ సర్వే తేల్చిచెప్పింది. ఇక బీజేపీ కి 4 , ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆ స‌ర్వే తెలిపింది.

abp-c voter survey shocks trs,abp-c voter survey gave shocks to trs,congress kutami will win in next elections,trs will loose in up coming elections,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *