ADHUGO REVIEW

Adhugo Movie
ప్రేమ‌క‌థా చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ర‌విబాబు తొలిసారి రూట్ మార్చి కాస్త ప్ర‌యోగాత్మ‌కంగా లైవ్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో తెర‌కెక్కించిన చిత్ర‌మే `అదుగో`. ఈ టెక్నాల‌జీతో సినిమాను తెర‌కెక్కించ‌డానికి ర‌విబాబు చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. అస‌లు అంత క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉందా?  మ‌రి అదుగో స్పెష‌ల్ ఏంటి?  ర‌విబాబుకి అదుగో ఎలాంటి విజ‌యాన్ని తెచ్చిపెట్టింది?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం…
స‌మ‌ర్ప‌ణ‌:  సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్
క‌థ‌, నిర్మాత‌, ద‌ర్శక‌త్వం: ర‌విబాబు
మాట‌లు: ర‌విబాబు, నివాస్‌
బ్యాన‌ర్స్‌:  సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్‌
న‌టీన‌టులు : అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్‌.కె, వీరేంద‌ర్ చౌద‌రి త‌దిత‌రులు
సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహార్‌
కెమెరా : ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
ఎడిటింగ్‌: బ‌ల్ల స‌త్యనారాయ‌ణ‌
క‌థ‌:
సినిమా అంతా ప్ర‌ధానంగా ఓ పంది పిల్ల‌పైనే ర‌న్ అవుతుంది. బంటి అనే పందిపిల్ల‌కు పొట్ట‌పై మూడు చుక్కులుంటాయి. దాని కార‌ణంగా షార్జా శంక‌ర్ మ‌నుషులు దాన్ని చంటి అనే కుర్రాడి చేతి నుండి బ‌ల‌వంతంగా లాక్కుని పారిపోతారు. వారొక ప్ర‌మాదంలో అనుకోకుండా చ‌నిపోతారు. బంటి హైద‌రాబాద్‌కు చెందిన సిక్స్ ప్యాక్ శివ మ‌నుషుల చేతికి చిక్కుతాడు. అనుకోకుండా బంటి వారికి అవ‌స‌ర‌మైన ఓచిప్‌ను తినేస్తుంది. బంటిని వాళ్లు శివ ద‌గ్గ‌ర‌కు పార్శిల్ చేస్తారు. మ‌రోవైపు అభి(అభిషేక్ వ‌ర్మ‌)పై అత‌ని ల‌వ‌ర్ రాజి(న‌భా) కోప‌గించుకుని ఉంటుంది. ఆమెను ప్ర‌సన్నం చేసుకోడానికి ఆమెకు ఇష్ట‌మైన కుక్క‌పిల్ల‌ను పార్శిల్ చేస్తాడు. అయితే రాజి ఇంటికి కుక్క ప్లేస్ బంటి వెళ్లిపోతుంది. బంటి స్థానంలో శివ ద‌గ్గ‌ర‌కు కుక్క వెళ్లిపోతుంది. మ‌రో వైపు గుట్కా గంగ‌రాజు, షార్జా శంక‌ర్ పోలీసుల క‌ళ్లు క‌ప్పి జంతుల మ‌ధ్య ప‌రుగు పందాల‌ను నిర్వహిస్తుంటారు. ఓ జ్యోతిష్యుడి మాట‌పై న‌మ్మ‌కంతో మూడు మ‌చ్చ‌లున్న పందిపిల్లే ఈ పోటీలో గెలుస్తుంద‌ని ఇద్ద‌రూ న‌మ్మి అలాంటి పందిపిల్ల కోసం వెతుకుతుంటారు. అనుకోకుండాబంటి  అదే ల‌క్ష‌ణాల‌తో బంటి వారికి క‌న‌ప‌డుతుంది. మ‌రి ఇంత మందికి అవ‌స‌ర‌మైన బంటి .. అన్ని స‌మ‌స్య‌ల‌ను దాటి చంటిని ఎలా చేరుకుంటుంద‌నేదే క‌థ‌. సినిమా చూడాల్సిందే…
స‌మీక్ష‌:
క‌న్‌ఫ్యూజింగ్ డ్రామా.. ఓ వ‌స్తువు వెంట హీరో, హీరోయిన్‌, వారి వెంట మ‌రికొన్ని గ్యాంగులు ప‌డ‌టం చివ‌ర‌కు క‌థ సుఖాంతం అవ‌డం అనే కాన్సెప్ట్‌తో స్వామి రారా స‌హా చాలానే సినిమాలు వ‌చ్చాయి. అలాంటి క‌థ‌తో రూపొందిన చిత్రం అదుగో. ఇందులో న‌టీన‌టులు విష‌యానికి వ‌స్తే ర‌విబాబు, అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ఆర్‌.కె ఇలా కొంత మంది మాత్ర‌మే నోటెడ్ న‌టీన‌టులు న‌టించారు. అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సినిమాలో ప్ర‌ధానంగా న‌టించిన బంటి పాత్ర‌లో పంది పిల్ల లైవ్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో క్రియేట్ చేసిందే కొన్ని సన్నివేశాల‌కు మాత్ర‌మే ఓరిజిన‌ల్ పందిపిల్ల‌ను ఉప‌యోగించారు. దాదాపు యానిమేటెడ్ పందిపిల్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగించారు. పందిపిల్ల త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ను దాటి త‌న చంటి ద‌గ్గ‌ర‌కు చేరుకోవాల‌నుకోవ‌డం.. అలాగే చంటి కూడా బంటి కోసం తాప‌త్ర‌య ప‌డే స‌న్నివేశాలున్నా… ఎమోష‌న‌ల్‌గా ఎక్క‌డా క‌నెక్టింగ్‌గా అనిపించ‌దు. ర‌విబాబు అడల్ట్ కామెడి కొన్ని స‌న్నివేశాల్లో క‌న‌ప‌డుతుంది. గంగ‌రాజు, శంక‌ర్ పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ వాస్త‌వానికి చాలా దూరంగా ఉంటాయి. ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాణంతో పాటు న‌టించాడు. ర‌విబాబు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. సుధాక‌ర్ రెడ్డి కెమెరా వ‌ర్క్ బాగానే ఉంది. ప్ర‌శాంత్ విహారి పాట‌లు, నేప‌థ్య సంగీతం పెద్ద‌గా బాలేదు. మొత్తానికి ర‌విబాబు ప‌డ్డ రెండున్న‌రేళ్ల శ్ర‌మ‌ను సినిమా చూసిన త‌ర్వాత అయ్యో పాపం అనుకునేలా ఉంది.
బోట‌మ్ లైన్‌:  బోరింగ్ బంటి
Adhugo Movie, Adhugo Movie review , Telugu latest movie, Suresh productions new movie Adhugo, Director Ravibabu, Telugu Movie updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *