అమిత్ షాకు అస్త్రంగా మారిన శ‌బ‌రిమ‌ల వ్య‌వ‌హారం

 Amit Shah

దేశ వ్యాప్తంగా బీజేపీ ని విస్త‌రించేందుకు మోదీ, అమిత్ షా ధ్వేయం క‌ష్ట‌ప‌డుతుంది. ద‌క్షిణాది రాష్ట్రాలపై మెల్లమెల్లగా పట్టుని సాధిస్తున్నారు. కర్ణాటకాలో ఎలాగైతే బీజేపీ ని పూర్తి స్థాయిలో విస్తరించిందో గత ఎన్నికల్లో బయల్పడింది..ఇక తమిళనాడు రాష్ట్రం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది..జయలలిత మరణం తరువాత నుంచీ జరిగిన అన్ని పరిస్థితులు బీజేపీ కనుసన్నల్లో జరిగాయనేది జగమెరిగిన సత్యం.
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ ఆడింది ఆట పాడింది పాట..అక్కడ తుమ్మినా సరే బీజేపీ కి తెలియాల్సిందే. ఇక ఇప్పటి వరకూ తన పాదం మోపని కమ్యునిస్టుల కంచుకోట వైపు బీజేపీ ఆశగా చూస్తోంది.ఎప్పటినుంచో కేరళలో కాషాయ జెండా ఎగరేయాలని అనుకున్న బీజేపీ కి శబరిమల అంశం అద్భుతమైన అస్త్రంగా ఉపయోగపడుతోంది…అందులో భాగంగానే శబరిమల ఆలయ వ్యవహారంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహిళలని అనుమతించాలని కోర్టు కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఆదిశగాప్రభుత్వం చర్యలు చేపట్టడం, దాంతో అయ్యప్ప భక్తులు మహిళలని వెళ్ళనివ్వకుండా చేయడం, ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆరెస్సెస్ వారిని అయ్యప్ప భక్తులను అరెస్టులు చేయడం ఇవన్నీ బీజేపీ కి కలిసి వస్తున్న అంశాలుగా చెప్పవచ్చు.అందుకే “షా” కన్నూర్ జిల్లా లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి ..అక్కడ ఏర్పాటు చేసిన సభలో “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ ప్రసంగం మొదలు పెట్టారు..కేరళ ప్రభుత్వం కావాలనే హిందూదేవాలయాలని టార్గెట్ చేస్తోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు…ఊహించని ఈ పరిణామం తో ఒక్క సారిగా కేరళ సీఎం విజయన్ షాక్ తిన్నారు. అప్పటికి కాని విజయన్ కి అర్థం కాలేదు మోడీ, షా ల వ్యూహం.కేరళలో మత సంప్రదాయాలకు, రాష్ట్ర ప్రభుత్వ క్రూరత్వానికి మధ్య పోరాటం జరుగుతున్నదని ప్రభుత్వంపై షా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు..కేరళ ప్రభుత్వం చేస్తున్న క్రూరత్వాన్ని ఆపాలని , మతం పేరిట హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దని సీఎంను హెచ్చరిస్తున్నాను అని అన్నారు. దేశంలోని పలు ఆలయాలలో మహిళలకు ప్రవేశం లేదని,కొన్ని ఆలయాల్లో పురుషులకి ప్రవేశం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఫైర్ అయ్యారు. దాంతో ఒక్క సారిగా బీజేపీ అజెండా బయటపడింది. దాంతో భవిష్యత్తు వ్యుహాలని విజయన్ సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మోడీ షా ల వ్యూహం చివరికి ఫలిస్తుందా లేదా అనేది భవిష్యత్తులో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

 Amit Shah Political News in Sabarimala   , BJP Party latest news in Sabarimala

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *