ర‌జ‌నీకాంత్‌తో ప‌ని చేయ‌డ‌మో గౌర‌వం

AMYJACKSON @ ROBO 2
రజనీకాంత్‌గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప గౌరవంగా ఉంద‌న్నారు రోబో 2 హీరోయిన్ ఎమీ జాక్స‌న్‌. రోబో 2 ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఏమ‌న్నారంటే..

దర్శకనిర్మాతల వల్లనే నా కల నెరవేరింది. యానిమేట్‌ చేసిన రోబోలాగా నటించాను. రోబోలాగా డ్యాన్స్ చేయమన్నారు. చిట్టి, నా పాత్రలు చాలా బాగా ఉన్నాయి. శంకర్‌ మూడేళ్ల ముందు చెప్పిన కథ ఈ రూపం రావడానికి వేల మంది పనిచేశారు. రజనీగారితో, అక్షయ్‌ గారితో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నీరవ్‌గారితో మూడో సినిమా చేస్తున్నా. ముత్తురాజ్‌గారు చాలా కష్టపడ్డారు. 4డీ గురించి కూడా నాకు తెలియదు. ఆంటోనీతో నాలుగో సినిమా చేశాం. రెహమాన్‌గారు చాలా మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. సుభాష్ కరణ్‌కి థాంక్స్‌” అని అన్నారు.

ఎడిటర్‌ ఆంటోనీ మాట్లాడుతూ ”శంకర్‌గారితో ఐదు సినిమాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. వీఎఫ్‌ఎక్స్‌ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ”అసాధ్యమైన విషయాలనే శంకర్‌గారు ఆలోచిస్తారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించి శంకర్‌గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఎక్కువ గైడ్‌ చేసేవారు 25 టీమ్స్‌గా మేం చేశాం. వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు అన్నిటికీ థాంక్స్‌. రజనీగారికి, అక్షయ్‌గారికి, రెహమాన్‌గారికి ధన్యవాదాలు. రసూల్‌గారు 4డీ సౌండ్‌ చేయడం చాలా గొప్ప విషయం” అని అన్నారు.

యాక్షన్‌ సిల్వ మాట్లాడుతూ ”శంకర్‌ సార్‌ శిల్పిలాంటివాడు. ప్రతి సీన్‌నీ చెక్కాలనుకుంటారు. ఆయనతో నేను శివాజీకన్నా ముందు ఓ సినిమా, శివాజీ చేశాను. అప్పట్లో నేను పీటర్‌ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నాను. నన్ను మాస్టర్‌ని చేసి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రజనీసార్‌ చాలా చిన్న వ్యక్తుల నుంచి కూడా నేర్చుకోవాలనే స్వభావం ఉన్న వ్యక్తి. ఆయనకు నాలుగు కుట్లు పడేంత గాయమైనప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా షూటింగ్‌ చేశారు. అక్షయ్‌కుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముంబైలో స్టంట్‌ యూనియన్‌కు ఆయనే ఇన్‌స్యూరెన్స్‌ చేసిచ్చారు” అని అన్నారు. కెమెరామేన్‌ నీరవ్‌ షా మాట్లాడుతూ ”2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం. ఈ సినిమా విషయంలో నాకు చాలెంజ్‌ కన్నా లెర్నింగ్‌ ఎక్స్‌ పీరియన్స్ ఎక్కువగా అనిపించింది. కథ విన్నప్పుడు తల ఊపానుకానీ, ప్రయాణంలోనే ఎక్కువ నేర్చుకున్నా” అని అన్నారు.

ప్రొడక్షన్‌ డిజైనర్‌ ముత్తురాజ్‌ మాట్లాడుతూ ”నా సినిమా కెరీర్‌లో ఫస్ట్ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్‌. త్రీడీ కోసం చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా నేర్చుకున్నా. రజనీకాంత్‌గారి ఫ్యాన్‌ అయిన నేను ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నా అసిస్టెంట్లు చాలా కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదాలు. టీమ్‌కి క తజ్ఞతలు. ఈ సినిమా కథ వినగానే ముందు ఈ సినిమా ప్రాపర్టీస్‌ చేశాం. రోబోటిక్‌ ఆర్మ్స్‌ చేశాం. ఇన్‌సెట్స్‌లో బర్డ్‌ వంటివన్నీ, నెమలి వంటివన్నీ చేశాం. చాలా ఆర్మీ ట్యాంకర్లు, స్ట్రైకర్లు వంటివన్నీ చేశాం. దాదాపు ఏడాదిన్నర మెషిన్లు చేశాం. వీటితో సెట్‌కి సంబంధం లేవు. కేవలం రెండు టీమ్‌లు దీనికోసమే పనిచేశాయి” అని అన్నారు.

అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ”2, 3 గంటలు ప్రాక్టీస్‌ చేసి తమిళ్‌లో రాసుకుని మాట్లాడుతున్నా. ఆనందంగా ఉంది. రజనీసార్‌, శంకర్‌సార్‌, రెహమాన్‌గారితో కలిసి ‘2.0’లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్‌ అయిన టీమ్‌కి ధన్యవాదాలు” అని అన్నారు. అనంతరం విశాల్‌ అడిగిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నకు అక్షయ్‌ సమాధానమిస్తూ ”నాకు నా జిమ్‌ ఉంది. నేను ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు లేస్తా మా నాన్న ఆర్మీలో ఉండేవారు. నా చిన్నతనం నుంచి చేస్తున్నా. నా లైఫ్‌ స్టైల్‌ నాకు ఇష్టం. ఎవరూ నన్ను ఇలాగే చేయమని ఫోర్స్ చే యలేదు. నా జీవితంలో ప్రతి రోజూ నేను సన్‌రైజ్‌ని చూస్తాను. నేను ప్రతి రోజునూ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను. నాకు నా శరీరమే దేవాలయం. మా నాన్న నాకు అదే నేర్పించారు. నాకు విశాల్‌ గురించి తెలుసు. తను అన్నం తినడని నాకు తెలుసు. వాళ్ల అమ్మకు అది నచ్చదని కూడా నేను చదివా. కనీసం ఆదివారమైనా అన్నం, దోసలు, ఇడ్లీలు తినాలని ఆశిస్తున్నా” అని అన్నారు. క తిక అనే ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ”ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్‌ నా దృష్టిలో సైంటిస్ట్‌. ఆయన డైరక్టర్‌ మాత్రమే కాదు, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. మూడున్నర గంటలు కూర్చుని మేకప్‌ చేసుకోవడం, ఏడాదిన్నర దాన్ని తీసుకోవడం నేను మర్చిపోలేను. నేను గత 28 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇన్నేళ్లుగా వేసుకున్న మేకప్‌ మొత్తం ఈ సినిమాకు వేసుకున్న మేకప్‌తో సరితూగదు. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శంకర్‌గారికి ధన్యవాదాలు” అని అన్నారు.

ROBO 2 MOVIE HIGHLIGHTS

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *