కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఆర్కే… అలా చెప్పేశారా

Andhrajyothi Radhakrishna

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. తన కొత్తపలుకులో కొత్త విషయాలు వెల్లడించారు. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుస్తుందని 80 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ఐదు వారాల కిందట రాసిన…కొత్త పలుకులో చెప్పారు. ఆర్కే రాసిన వ్యాసాన్ని చదివి షాక్ తినటం రాజకీయ వర్గాల పనయ్యింది. అయితే ఇప్పుడు ఆర్కే కొత్త పలుకులో నిజంగానే కొత్త పలుకందుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని తేల్చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని ఆత్మహత్యలుంటాయని కేసీఆర్ పరిస్థితి అలాగే ఉందన్నారు.
తన అహంకార ధోరణితో ముందుకు పోతున్నారన్న ఆర్కే తెలంగాణా ప్రజలు అహంకారాన్ని సహించరని చెప్పారు. కేసీఆర్ ప్రచారం జోరుగా చేసినా కూటమి ప్రచారంలో వెనకబడినా కూటమికి ఆదరణ, గులాబీ దళానికి వ్యతిరేఖత పెరిగిపోతుందని చెప్పారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అరవై ఐదు శాతం సానుకూలత పోయిందని చెప్పిన ఆయన నేరుగా కేసీఆర్ ఓడిపోతున్నారని చెప్పకనే చెప్పారు.
ఈ సందర్భంలో గతంలో ఇలాగే ముందస్తుకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి గుర్తు చేశారు. కేబినెట్ మొత్తాన్ని డిస్మిస్ చేసిన… ఎన్టీఆర్‌ను కల్వకుర్తిలో ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరగోబోతోందన్నట్లుగా కొత్తపలుకుల్లో ఆర్కే తేల్చేశారు. స్వయంకృత అపరాధం చేస్తుందని అందుకే గులాబీ పార్టీ ఓటమి చవి చూసే అవకాశం వుందని ఆయన తెలిపారు.చంద్రబాబు పొత్తు కోసం ముందుకు వచ్చినా కాదు పొమ్మన్న కారణం, బాబును ఎడాపెడా నోటికి వచ్చినట్టు తిట్టిన కారణమే బాబు జాతీయ రాజకీయాల్ల ఎదుగుదలకు, కేసీఆర్ పతనానికి కారణమని చెప్పి గులాబీ బాస్ ను షాక్ కు గురి చేశారు ఆర్కే.

Radhakrishna , Andrajyothy M.D. Radhakrishna given shock to KCR , Andrajyothy M.D. Radhakrishna latest news, Telangana latest news, KCR latest news, telugu latest news, telugu update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *