కూటమికి మద్దతు పలికిన మరో పార్టీ

another party joined in mahakutami

మ‌హాకూట‌మిలో ఇప్పుడు ఒక కొత్త పార్టీ వచ్చి చేరింది.  ఇప్ప‌టికే మ‌హా కూట‌మి దెబ్బ‌కు అత‌లాకుత‌లం అయిపోతున్న అధికార పార్టీకి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. తెరాసను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమిలో మరో పార్టీ ఎటు వంటి సీట్లు ఆశించ‌కుండానే కూటమికి భేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది. ఆల్‌ ఇండియా ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ కూటమికి తన మద్దతు  ప్రకటించింది. హిందు ఓట‌ర్ల‌ను బీజేపీ, ముస్లిం ఓట‌ర్ల‌ను ఎంఐఎం మోసం చేస్తూ టీఆర్ఎస్ తో క‌లిసి అంత‌ర్గ‌త ఒప్పందం చేసుకోవ‌డం సిగ్గుచేటని ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఘని అన్నారు.

బీజేపీ, తెరాస, ఎంఐఎం మధ్య అంతర్గత ఒప్పందం మహా ప్ర‌మాద‌మ‌ని… ఎంఐఎం ముస్లింల పార్టీ కాద‌ని ఒవైసీల పార్టీ అన్నారు. హైద‌రాబాదు ముస్లింలు ఎదిగితే ఎప్ప‌టికీ త‌మ మాట విన‌ర‌ని… వారిని అభివృద్ధి చెంద‌నీయ‌కుండా చేసే ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ అన్నారు. అలాంటి పార్టీతో హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ ర‌హ‌స్య ఒప్పందం చేసుకోవ‌డం… ఈ దేశ ప్ర‌జ‌ల‌కు ప‌ట్టిన క‌ర్మ అన్నారు.

గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ జాతీయ నేత ఆర్‌సీ కుంతియా ఆయ‌న స‌మావేశం అయ్యారు. అనంత‌రం వారిద్ద‌రు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారు ఏమ‌న్నారంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ఇచ్చిన హామీలకు తగిన నిధులు కేటాయించలేదన్నారు. దారుణంగా ముస్లింల‌ను మ‌భ్య‌పెట్టార‌ని చెప్పారు. ముస్లింల‌ను అంత మోసం చేస్తే ఎంఐఎం టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అధికార దాహం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. టీఆర్ఎస్ బీజేపీకి సంపూర్ణ‌ మద్దతిస్తోందని, అందుకే తాము కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న‌ట్లు చెప్పారు.

another party joined in mahakutami,all india national league party joined in mahakutami,congress leader rc kunthia sensational comments on trs party

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *