మ‌ళ్లీ అల‌జ‌డి

Another war  Chhattisgarh

త్వ‌ర‌లో కొత్త నాయ‌క‌త్వం ప‌గ్గాలు ఓవైపు
ఉనికి ప్రాబ‌ల్యం చాటింపు మ‌రోవైపు
ఛ‌త్తీస్ గ‌ఢ్ అడ‌వులు మ‌రోమారు తుపాకీల మోత‌తో
ద‌ద్ద‌రిల్లాయి.. మావోల చ‌ర్య‌తో భ‌ద్ర‌తా ద‌ళాలు ఉలిక్కిప‌డ్డాయి
న‌లుగురు జ‌వానులు మ‌ర‌ణించారు.. ఆ వివ‌రాలివి..

మావోయిస్టుల ప్ర‌భావిత ప్రాంతాల్లో మ‌ళ్లీ అల‌జ‌డి నెల‌కొంది. ఛ‌త్తీస్ గ‌ఢ్ లో మ‌రో యుద్ధ వాతావ‌ర‌ణం రాజుకుంది. దంతేవాడ జిల్లా బ‌చేలి స‌మీపాన భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై మావోయిస్టులు దాడి చేసి న‌లుగురు మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యారు. ముగ్గురు గాయ‌ప‌డ్డారు. గ‌త కొద్దికాలం గా ఇక్క‌డ మావోయిస్టుల ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఎన్నిక‌ల దృష్ట్యా ఈ అల‌జ‌డులు మ‌రింత రేగే అవ‌కాశం ఉం ది. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాస్త గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగే వాతావ‌ర‌ణం లేద‌నే తేలిపోయింది. మావోల ప్రాబ‌ల్యం ఉనికి చాటుకునే క్ర‌మంలో ఇటీవ‌లే ఓ దూర‌ద‌ర్శ‌న్ కెమెరాపర్స‌న్ తో పాటు మ‌రో ముగ్గురిని హ‌త‌మార్చిన ఘ‌ట‌న మ‌రువక మునుపే ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

పోలింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా తొలి విడ‌త ఈ నెల 12న జ‌ర‌గ‌నుంది
ఇక్క‌డి 90 స్థానాల్లో తొలి విడ‌త‌గా 18 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు.
మావోల‌కు ప్రాబ‌ల్యం ఉన్న 8 జిల్లాల‌లో ఈ తొలి విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు.
శుక్ర‌వారం కాంగ్రెస్ అధ్య‌క్షులు రాహుల్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యాన వారు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో పై స్థాయి నేత‌ల ప‌ర్య‌ట‌న
అటు పోలీసుల‌కూ ఇటు మావోల‌కూ కీల‌కం కానుంది.

Another war  Chhattisgarh , War  onces again  in Chhattisgarh forest , Dhandewada District , Bacheli , The Maoists attacked the security passenger bus and caused four deaths , Telugu news, Update News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *