ప‌దుగురి సంక‌ల్పానికి ప‌దివేల వంద‌నాలు

ప్రకృతి స‌వాళ్లు విసురుతున్న ప్ర‌తిసారి మాన‌వ స‌మూహం గెలుస్తూనే ఉంది. చావుని ఎదుర్కొని బ‌తుకుని దిద్దుకుంటోంది. శ్రీ‌కాకుళం లాంటి మారుమూల ప్రాంతాల‌కు ఇవి కొత్త‌కాదు. వీటి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డమే అత్యావ‌శ్య‌కం.సీఎం చంద్ర‌బాబు ఈ రోజు చెప్పిందిదే.రానున్న కాలంలో ఇలాంటి విప‌త్తుల‌కు త‌లవొంచాల్సిన స్థితిరాకుండా శ్రీ‌కాకుళాన్ని స‌న్న‌ద్ధం చేయ‌డ‌మే.ఈ విల‌యం వేళ ఎంద‌రెంద‌రో అధికారులు ఐఏఎస్ స్థాయి నుంచి ద‌ఫేదార్ దాకా త‌మ‌వంతు కృషి చేశారు. అతి బీద‌వారు సైతం త‌మ‌వంతుగా విరాళం ఇచ్చి తోటివారికి అండ‌గా నిలిచారు. మాన‌వ సంక‌ల్పంకు తోడయ్యారు. ఈ వేళ వారంద‌రికీ మ‌నం వంద‌నాలు చెప్పాలి. మ‌రో క‌ష్టం ఇలా ప‌ల‌క‌రించ‌రాద‌ని గాలి దేవ‌ర‌ను వేడుకోవాలి. కాకినాడ నుంచి వ‌చ్చిన స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ (పాత‌ప‌ట్నం ప్ర‌త్యేక అధికారి) ద‌స‌రా పండుగ రోజు కూడా ప‌నిచేయ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని అంటున్నారీమె. గతంలో వ‌చ్చిన హుద్ హుద్ స‌మ‌యంలోనూ దీపావ‌ళి రోజు తాను విధులు నిర్వ‌ర్తించాన‌ని చెబుతున్నారీమె. ఒక్క ఆమె అనేకాదు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చిన అధికారులు డిప్యూటీ క‌లెక్ట‌ర్లు, ఐఏఎస్‌లు, ఐఎఫ్ఎస్‌లు తమ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించారు. క‌విటి మండ‌ల ప్ర‌త్యేకాధికారిగా ప‌నిచేసిన గుంటూరు జిల్లా డిప్యూటీ క‌లెక్ట‌ర్  పి.గ్లోరియా మాట్లాడుతూ..తిత్లీ తుఫాను వ‌చ్చాక అక్టోబ‌ర్ 12 నుంచి ఇక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్నాన‌ని, డి.జి.పుట్టుగ‌, భైరిపురం,బొరివంక‌, బి.జి.పుట్టుగ పంచాయ‌తీల బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని నేరుగా ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించి క్షేత్ర స్థాయి అధికారులతో మాట్లాడి తాగునీరు, భోజన‌, వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించానని అన్నారు. ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని అన్నారు.ఇంకా ఎంద‌రెంద‌రో..  ఆరోగ్యం సైతం లెక్క చేయ‌క బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి సహాయ పున‌రావాస చ‌ర్య లను ప‌ర్య‌వేక్షించారు.కృష్ణా జిల్లా నుంచి ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌త్యేక క‌లెక్ట‌ర్  ప్ర‌భాక‌ర్ రెడ్డి (కోట‌బొమ్మాళి మండ‌లం ప్ర‌త్యేక అధికారి) మాట్లాడుతూ ద‌స‌రా పండుగ‌కు ఇంటికి వెళ్ల‌లేద‌ని, దీపావ‌ళికి కూడా వెళ్తాన‌ని అనుకోవ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల క‌ష్టాల కంటే పండుగ‌లు ముఖ్యం కాద‌ని అన్నారు. పోల‌వ‌రం స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్  భాను ప్ర‌సాద్ దీ ఇదే అభిప్రాయం. ఆయ‌న మెళియాపుట్టి మండ‌లానికి స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా ఉన్నారు. తుఫాను బాధ నుంచి ప్ర‌జ‌లు ఎప్పుడు బ‌య‌టకు వస్తే అప్పుడే త‌మ‌కు పండ‌గ‌ని అంటున్నారీయ‌న‌. టెక్క‌లి ప్ర‌త్యేకాధికారిగా ప‌నిచేస్తున్న  సుమ‌త్ కుమార్ (స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్) సొంత రాష్ట్రం హ‌ర్యానా. రాజమండ్రి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ఇక్క‌డ క‌ష్టాలు చూసి త‌న‌కు ఎక్క‌డికీ వెళ్లాల‌నిపించ‌డం లేద‌న్నారు. ఇలా అంద‌రిదీ ఇదే అభిప్రాయం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైతం వీరి అంకిత భావానికి
ముగ్ధుల‌య్యారు. ప‌రిహారం పంపిణీ  వేళ ప‌లాస కేంద్రంగా వీరంద‌రినీ స‌న్మానించారు.
ap cm chandrababu naidu latest news,ap cm chandrababu naidu talks about srikakulam district,ap cm chandrababu naidu update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *