న‌యా కూట‌మి

ap cm chandrababu naidu latest news

నోరు పాత సారా వాస‌న వేస్తుంద‌ని అంటారు. అలానే రాజ‌కీయం కూడా అనుకోవ‌లె. బాబుగోరు గేరు మార్చి కొత్త కూట‌మికి సిద్ధం అవుతున్నారు.మోడీని దించేస్తాం అంటూ బీరాలు ప‌లుకుతున్నారు.అది అయ్యేనో లేదో కానీ ఇప్పుడే అన‌గా ఈ రోజు సాయంత్రం బాబు రాహుల్ భేటీ అయ్యారు.ఎవ‌రిని ఎదిరించి ధిక్క‌రించి  పార్టీ పెట్టారో నాడు ఎన్టీఆర్ అవ‌న్నీ కాద‌ని ఇప్పుడొక కొత్త వ‌ర్గ స‌మీక‌ర‌ణం తెర‌పైకి వ‌చ్చింది.కొన్ని అనుకూల మీడియాలు ఇదొక చారిత్ర‌క అవ‌స‌రం అని రాస్తున్నాయి. ఎవ‌రికి చారిత్ర‌కం.. ఎలా అవుతుంది.రోజుల్లేని ప‌వార్, ఫ‌రూక్ వ‌ల్ల క‌లిసే ప్ర‌యోజ‌నం ఏముంద‌ని? ఇంత‌కాలం టీడీపీ కాంగ్రెస్ ఉప్పూ నిప్పూ ఇప్పుడు పాలూ తేనె.. క‌నుక రాహుల్ బాబు ద్వ‌యం విన్నింగ్ కాంబోగా రానుంద‌న్న మాట. ఈ ఎన్నిక‌ల త‌మాషాలు ఇంకెన్ని రానున్నాయో మ‌రి! గ‌తంలో యునైటెడ్ ఫ్రంట్ ఉన్న స‌మ‌యంలో కాంగ్రెస్ తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపార‌ని త‌రువాత ఇన్నేళ్ల‌కు కాంగ్రెస్ పెద్ద‌ల‌తో బాబు చ‌ర్చించ‌డం ఓ గొప్ప విష‌యం అని అనుకూల మీడియా ఓ వార్త రాసి విసిరేసింది.ఏదేమైనా కాంగ్రెస్ – టీడీపీ పొత్తు ప్ర‌జ‌ల ఆమోదం పొందుతుంది అనుకోవ‌డం ఓ పెద్ద భ్ర‌మ‌. అటు తెలంగాణ‌లో  బ‌ల‌ప‌డేది ఉండ‌దు.. ఇటు ఆంధ్ర‌లో కొత్త‌గా సంపాదించుకునేదీ ఏమీ ఉండదు. ఓటు  బ్యాంక్ రాజ‌కీయాల్లో భాగంగా ఉండే ఈ క‌ద‌లిక‌లు త‌ప్ప‌క ప్ర‌త్య‌ర్థి క‌లిసివ‌స్తాయి.

ap cm chandrababu naidu latest news,ap cm chandrababu naidu friend ship with congress party,cm chandrababu naidu latest news,

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *