చంద్రబాబుఇంటికి విందుకు వస్తున్న జాతీయ నాయకులు, రాహుల్ గాంధీ

ap cm chandrababu naidu latets news

టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎపీకి అన్యాయం చేసిన బీజేపీని గద్దె దించటం కోసం ఆయన నడుం బిగించారు. అన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ ఉన్న ప్రాంతీయ  పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలిసి వారిని బీజేపీయేతర కూటమిలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

యూపీఏలో తన స్ధానాన్ని పటిష్టం చేసుకునే పనిలో పడిన  టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తాజాగా అమరావతి వేదికగా  విందు కు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల23వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో విందు ఏర్పాటు చేసి ఈ విందుకు దేశ వ్యాప్తంగా పలువురు యూపీఏ, బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్న  ప్రాంతీయ రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు చంద్రబాబు. అయితే ఈ విందుకు ఈ విందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి  పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత, తేజస్విని యాదవ్ తదితర కీలక నేతలు హాజరు కానున్నారు.

అంతే కాదు అదే రోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రతేక హోదా కోసం నిర్వంచే ధర్మపోరాట దీక్షలో  జాతీయ నాయకులంతా పాల్గొని మాట్లాడతారు. ఏపీ ప్రత్యేక హోదాకు తమ మద్దతు తెలుపుతారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందం గా జాతీయ  నేతలందరినీ అమరావతి తీసుకు రావడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు కూడా ప్రత్యేక హోదా భరోసా ఇస్తున్నారు. జాతీయ స్ధాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ శక్తిని తీర్చిదిద్దుతున్నారనే పేరు రావడంతో పాటు… ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం వారిని చంద్రబాబు ఇన్వాల్వ్ చేయగలిగారనే భావన ఆంధ్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో నాయకులను ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం కదిలించగల శక్తి చంద్రబాబుకే ఉంది.

cm chandrababu naidu latets news,chandrababu invited rahul gandhi for lunch,congress leader rahul gandi latest news,rahul gandhi going to chandrababu home

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *