కేంద్రంలోనూ,తెలంగాణాలోనూ బాబు ఫార్ములా అదే

AP CM Chandrababu

తెలంగాణలో అసెంబ్లీ రద్దుకు ముందు అధికారంలోకి వచ్చే పార్టీ అంటే టీఆర్ఎస్ అన్నారు. ఎందుకంటె అప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కనిపించలేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కనిపిస్తుంది. మహాకూటమిగా ఏర్పడిన టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ లు కలిసి పొత్తులతో ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు సిద్ధం అయ్యాయి. దీనితో ఇప్పుడు టీఆర్ఎస్ గట్టెక్కుతుందా అన్న భావన కలుగుతుంది. మహాకూటమి దెబ్బకు కేసీఆర్ కు షాక్ తగిలింది. చాలా వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ఆలోచించిన చంద్రబాబు కేంద్రంలో ఉన్న బీజేపీ కి బుద్ధి చెప్పటానికి ఇదే ఫార్ములా పాటించనున్నారు.
ఇదే ఫార్ములాను దేశం మొత్తం అమలు చేస్తున్నారు చంద్రబాబు. ముందుగా మోదీని గద్దె దించటమే లక్ష్యంగా దేశం మొత్తం పునరేకీకరణ జరగాల్సిన ఆవశ్యకతను గుర్తించిన చంద్రబాబు అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ తో సైతం కలిసి పని చేసందుకు సిద్ధం అయ్యారు. తాజాగా రాహుల్ గాంధీ తో భేటీ ఆయన చంద్రబాబు ఆ దిశగా చర్చలు జరిపారు. దేశాన్ని మోడీ పాలననుండి కాపాడటం తన ప్రధమ కర్తవ్యంగా భావించే ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.
అయితే ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొనసాగుతుందని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ తరుణంలో దాన్ని తిప్పి కొట్టాలని బాబు పార్టీ నేతలకు చెప్తున్నారు. జాతీయ రాజకీయాల వరకే కాంగ్రెస్ తో దోస్తీ ఉంటుందని చెప్తున్నారు. మోడీని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలిస్తేనే సాధ్యమని ఆయన చెప్తున్నారు. కేంద్రంలో బీజేపీ ని అధికారంలోకి రాకుండా చేసే ప్రయత్నం మినహాయించి మరేదీ కాదని చంద్రబాబు చెప్తున్నారు. ఏపీలో పొత్తుల ప్రస్తావన లేదని కేవలం జాతీయ రాజకీయాల్లో మాత్రమే స్నేహ బంధం కొనసాగుతుంది అని ఆయన చెప్పారు. ఇటు తెలంగాణాలోనూ, అటు కేంద్రంలోనూ అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి పోరాటం చేసే ఫార్ములాతో బాబు ముందుకు పోతున్నారు.

AP CM Chandrababu, Chandrababu latest news, Chandrababu update news on Telangana Mahakutami , Congress, TDP, TJS, TRS , KCR, BJP, Chandrababu new plan , AP Political News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *