చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ

Meet the leaders of the alliance at Chandrababu’s residence

  • ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్ మెంట్ పై చర్చ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక మూడు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఎన్నికల్లో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో నేతలంతా బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ప్రజాకూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ భట్టివిక్రమార్క, కర్టాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ తదితరులు హాజరయ్యారు. ప్రచార అనంతరం ఉన్న రెండు రోజుల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్‌మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రచారంలో భాగంగా కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడాలని, ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారే అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ.. ఆ విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. అలాగే ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదనే విషయాన్ని కూడా జనాల్లోకి ఎక్కించాలని చెప్పినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ జనసమితి నేత, న్యాయవాది రచనారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, కూటమిపై ఆరోపణలు చేయడంపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.

Today Deals on amazon Check Out Here 

Buy more books form amazon in discount Sale Click Here

Books that may help you to know about politics Check out here

Tags: Andhra politics, Strategies for april elections in andhra pradesh, Political Planning andhra elections, telangana politics, AP cm political news, political news update.

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *