అమరావతికి క్యూ కడుతున్న టీటీడీపీ నేతలు

AP Latest News
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టిన ఆ పార్టీ.. తెలంగాణలో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొటోంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన ఆ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి, వారిని కారెక్కేలా చేసింది. తర్వాత పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయాడు. దీంతో ఆ పార్టీకి సరైన నాయకులు లేనట్లైంది. నాయకత్వలేమి ఉన్నా గ్రామ స్థాయి నుంచి బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ కొద్దిరోజుల్లో జరగబోయే ముందస్తు ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా వీలైనన్ని సీట్లు సాధించి.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. అందుకోసం ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. మరో మూడు పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు టీటీడీపీ నేతలు. ప్రస్తుతం పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల సర్ధుబాటు వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వార్త టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
టీఆర్ఎస్‌ను మరోసారి గద్దెనెక్కనీయకూడదన్న ఉద్దేశ్యంతో ఏర్పడిన మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. అందుకే ఇది బాగా ఆలస్యమవుతోంది. కూటమిలోని మిగతా పార్టీలు సీట్ల కేటాయింపుపై తమ వాణి వినిపిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇటీవల తమకు మిత్ర ధర్మమే ముఖ్యమని, ఒకటి రెండు సీట్లు తగ్గినా పర్వాలేదని చెప్పడంతో ఆ పార్టీ వైఖరి అర్థమైంది. చంద్రబాబు ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ.. టీటీడీపీ నేతలు కోరిన సీట్ల కంటే తక్కువ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు చెందిన నేతలు ఇటీవల చంద్రబాబును కలిశారని తెలిసింది. వారిలో కొందరు తెలంగాణలోని చాలా స్థానాల్లో టీడీపీ బలంగా ఉందని, ఈ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకోవద్దని చంద్రబాబును కోరినట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ బాగా పట్టున్న గ్రేటర్‌లో మెజారిటీ సీట్లు కావాలని అక్కడి నేతలు అడుగుతున్నారట. ఇందులో భాగంగానే టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ నేతలు అమరావతి వెళ్లి మరీ చంద్రబాబును కోరారని విశ్వసనీయవర్గాల సమాచారం. మరి వీళ్ల విషయంలో బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

AP Latest News ,Telugu news update, AP Political news, Amaravathi Latest News, TDP Latest news, Congress party news,AP Election News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *