తాకట్టులో ఆత్మ‌గౌర‌వం 

AP Political News
తెలుగు వారి ఆత్మ‌గౌరవం తాక‌ట్టులో ఉంద‌ని నిన్న‌టి వేళ రుజువ‌యింది.నాడు ఎన్టీఆర్ ఆత్మ‌గౌర‌వ నినాదంతో స్థాపించిన పార్టీ సిద్ధాంతాల‌కు విరుద్ధంగా ముందుకు పోతోంది. ఆజ‌న్మ శ‌త్రువుతో దోస్తీ క‌ట్టి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తోంది.నాడు కాంగ్రెస్ తీవ్రంగా వ్య‌తిరేకించిన దేశం నాయ‌కులు ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద‌ల‌తో ఎలా క‌లిసి పోతారో అన్నది ఆస‌క్తిదాయ‌కం. చంద్ర‌బాబు, రాహుల్ స‌మావేశం అనంత‌రం తెలుగుదేశం వ‌ర్గీయులు సైతం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌దీ ఇదే విష‌యంపై.. పొత్తులు ఖ‌రారై కాంగ్రెస్ కు సీట్లు కేటాయిస్తే త‌మ గ‌తేం కాను అన్న‌ది వారిలో అంత‌ర్మ‌థ‌నంగా తోస్తున్న విష‌యం.ఈ సారి అధికారం ధ్యేయంగా రాహుల్ గాంధీ నెర‌పిన రాజ‌కీయ చ‌తుర‌త ఫ‌లాలు కాంగ్రెస్ కు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చునేమో కానీ తెలుగుదేశం మాత్రం ప్ర‌జ‌ల ముందు దోషి కాక త‌ప్ప‌దు.పెద్దాయ‌న ఆశ‌యాల సాధ‌నే ధ్యేయంగా తాము పనిచేస్తామ‌ని ఇక‌పై తెలుగు తమ్ముళ్లు చెప్పుకోవ‌డం కుద‌ర‌ని ప‌ని. ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసేందుకు దేశాన్ని కాపాడేందుకే తానీ ప‌నిచేశానని చంద్ర‌బాబు ఎన్నిసార్లు చెప్పినా ఆంధ్రా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఈ సారి న‌మ్మ‌రు. ఇప్ప‌టికే విభ‌జ‌న విష‌య‌మై కాంగ్రెస్ అంటే కోపం ఉన్నోళ్లు రేప‌టి వేళ ఏ ముఖంతో తెలుగుదేశానికి ఓటేస్తార‌ని.. దేశ ప్ర‌యోజ‌నాలు కాదు అవ‌న్నీ తెలుగు దేశం ప్ర‌యోజ‌నాల కోస‌మే అని విప‌క్షం చేస్తున్న ఆరోప‌ణ‌లు ఎలా తిప్పికొట్ట‌గ‌ల‌రని… ఓ విధంగా తెలుగుదేశానికిది క‌ష్ట‌కాలం.అనాలోచిత పొత్తులు కార‌ణంగా ఉన్న కాస్త పేరు కూడా పోగొట్టుకోవ‌డం చంద్ర‌బాబుకే సాధ్యం అన్న‌ది విప‌క్షాల నుంచి వ‌స్తోన్న విమ‌ర్శ‌.
AP Political News, Telugu news, Ap Latest News, Congress Latest News, Tdp Update News, Telugu Breaking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *