హోదా డ్రామా ఇంకెన్నాళ్లు

AP Political News

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు హోదా ఇస్తామ‌ని చెబుతుండ‌డం అందుకే ఆ పార్టీ అధినేత రాహుల్ తో చ‌ర్చ‌లు నెర‌పామ‌ని బాబు చెప్ప‌డం కాస్త హాస్యాస్ప‌దంగానే ఉంది.కేవ‌లం హోదా కోస‌మే కాంగ్రెస్ తో జ‌ట్టుకట్టార‌ని మ‌రే ఇత‌ర ప్ర‌యోజ‌నాలూ అందులో లేవ‌ని ఎలా చెబుతారో..హోదా అన్న‌ది ఇవ్వ‌డం ఇవ్వ‌క‌పోవ‌డంఇప్ప‌ట్లో తేలేదా.. దేశంలో కాంగ్రెస్ వ‌చ్చే ఛాన్స్ ఉన్న‌ట్లేనా.. ఉంటే అధికారంలోకి రాగానే హామీలు నెర‌వేర్చి తీరుతుందా ఏమో..! అప్పట్లో హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీ ముద్ద‌ని అన్నారు.. త‌రువాత ప్యాకేజీ కాదు హోదా క‌వాల‌ని అంటున్నారు ఇలా నోటికి వచ్చిన రీతిన టీడీపీ రాజ‌కీయాలు నెర‌ప‌డంతో ప్ర‌జా విశ్వాసం ఆ పార్టీ చూర‌గొంటుంద‌ని అనుకోలేం.మొద‌టి నుంచి కాంగ్రెస్ కు త‌మ‌కు శ‌త్రువు అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన టీడీపీ నేత‌లు ఈ సారి ఈ ప‌రిణామాల‌ను ఎలా స‌మ‌ర్థించుకుంటార‌న్న‌ది ఆస‌క్తిదాయ‌కం. ఈత‌రుణాన బాబు మార్క్ రాజ‌కీయాలు దేశ వ్యాప్తంగా ఫ‌లిస్తాయ‌ని ఫ‌లితాలు ఇస్తాయ‌ని సంబంధిత కూట‌మి నేతలు క‌ల‌ల క‌నడం హాస్యాస్ప‌దం. బీజేపీ హ‌వాను ఢీకొనే స‌త్తా నారా ఫ్రంట్ కు ఉంటుంద‌ని అనుకోలేం. ఓ స‌ర్వే ప్ర‌కారం బీజేపీ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ద‌క్కించుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోవ‌చ్చు. అలా అని కూట‌మి బీజేపీకి గ‌ట్టి పోటీగా నిలుస్తుంద‌నీ చెప్ప‌లేం. ఇవాళ రాహుల్ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతారా లేదా అన్న‌ది ఓ ప్ర‌శ్న‌. ఒకవేళ ఆయ‌నది స‌మ‌ర్థ నాయ‌క‌త్వం అన్న భ్రమ‌ల్లో బాబు అండ్ కో ఉంటే ఎవ్వ‌రూ ఏమీ చెప్పేది ఉండదు.

AP Political News , AP CM latest News, telugu news update , TDP Party Latest News, Congress Political News in AP, Telugu Breaking news, Mahakutami Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *