భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు

Apple iPhone price reduced

  • గరిష్టంగా రూ.17,340 తగ్గించిన యాపిల్

స్మార్ట్ ఫోన్ ప్రియులకు.. ముఖ్యంగా ఐఫోన్ కావాలనుకునేవారికి ఇది శుభవార్త. యాపిల్ ఐఫోన్ ధరలను భారీగా తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. పలు మోడళ్లపై గరిష్టంగా రూ.17,340 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ కంపెనీ తన ప్రతిష్టాత్మక ఐఫోన్ ను ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా మార్పులు చేసి ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఎక్స్ఎస్‌, ఎక్స్ఎస్‌ మ్యాక్స్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌ స్టాండ్‌ బైతో వీటిని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐఫోన్‌ టెన్‌, ఐఫోన్‌ 8ప్లస్‌ సహా పలు మొబైల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. త్వరలోనే ఈ ధరలను భారత్‌లోనూ అమలు చేయనుంది.

ఐఫోన్‌ 6ఎస్‌ సిరీస్‌ మొబైళ్ల ధర భారీగా తగ్గింది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 32జీబీ మోడల్‌ ధర రూ.52,240 ఉండగా, ఇప్పుడు రూ.34,900కే లభించనుంది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌128జీబీ వేరియంట్‌ ధర రూ.61,450 నుంచి రూ.44,900కు తగ్గించింది. ఐఫోన్‌ 6ఎస్‌ బేసిక్‌ వేరియంట్‌ రూ.29,900 నుంచి ప్రారంభం కాగా, హైఎండ్‌ మొబైల్‌ ధరను రూ.39,900గా ఉంది. ఇక ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.95,390 ఉండగా, దానిని రూ.91,900కి తగ్గించింది. ఇందులో టాప్‌ ఎండ్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,08,930 నుంచి రూ.1,06,900కి తగ్గించింది. ఐఫోన్‌ 8 ప్లస్‌ ధర కూడా తగ్గింది. 64జీబీ ఇక నుంచి రూ.69,900కే లభించనుంది. గతంలో దీని ధర రూ.77,560గా ఉండేది. ఐఫోన్‌8 ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.91,110 నుంచి రూ.84,900కు తగ్గించింది. అలాగే ఐఫోన్‌ 8 సిరీస్ లో 64జీబీ ధర రూ.67,940ఉండగా, ప్రస్తుతం అది రూ.59,900లకే లభించనుంది. ఐఫోన్‌ 8 టాప్‌ ఎండ్‌ మొబైల్‌ ధర రూ.81,500 నుంచి రూ.74,900కు తగ్గింది. ఐఫోన్‌ 7ప్లస్‌ 32జీబీ, 128జీబీ వేరియంట్‌ ధరలు వరుసగా రూ.49,900, రూ.59,900కే లభించనున్నాయి. ఇక ఐఫోన్‌ 7 32జీబీ వేరియంట్‌ను రూ.52,370 నుంచి రూ.39,900లకు తగ్గించింది. అలాగే ఐఫోన్‌7 128జీబీ ధరను కూడా రూ.61,560 నుంచి రూ.49,900లకు తగ్గించింది.

Apple reduced the prices for all Iphone and Apple Product Check Here

Apple iPhone 7, iPhone 8, iPhone 6s price reduced,Why Suddenly Iphone Price Cut,Any Issues For Cut The Price Of Apple Phone,Mobile Market,Latest Mobile Market Updates,Technology Updates,Apple cuts iPhone 7 and iPhone 8 prices

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *