రోబో 2లో పాట‌లు వ‌ద్ద‌నుకున్నారు..

AR REHAMAN@ ROBO 2

రోబో 2 లో ముందు పాట‌లు లేవ‌నుకున్నార‌ని.. కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ స్కోరే అనుకున్నార‌ని ఏఆర్ రెహ‌మాన్ చెప్పారు.
రోబో 2 ఆడియో లాంచ్ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలియ‌జేశారు. మ‌రి, ఆయ‌న ఏమ‌న్నారంటే..

”ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్‌ చేశారు. ముందు రీరికార్డింగ్‌ని కీబోర్డ్‌, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. అయినా విజువల్స్‌ కొన్నిటిని చూసినప్పుడు నేను చేసిన సంగీతం చాల్లేదనిపించింది. ఇప్పుడు ఇంకా చేశాం. సినిమాకన్నా వారం రోజుల ముందు రీరికార్డింగ్‌లో కొంత భాగాన్ని రిలీజ్‌ చేస్తాం. ఒక పర్సనాలిటీ లైక్ చేయాలంటే వాళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు. వాళ్ల జీవితం ఎలా ఎగ్జాంపుల్‌గా ఉంది వంటి విషయాలను గురించి ఆలోచిస్తాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు. ఆయన స్పిరిచువాలిటీగానీ, ఆయన సినిమాలోని చిన్న చిన్న డైలాగులుగానీ నాకు ఇష్టం. ఈ వయసులోనూ ఇలాంటి సినిమాలు చేయాలని ఆశ ఉండటం చాలా గొప్ప. చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్‌ కావాలని అనుకున్నా. అప్పుడే ‘రోబో’ సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక , ఆఫ్‌ సెట్‌, ఆన్‌ సెట్‌ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. నా తండ్రి ద్వారా వచ్చిన గౌరవంగా భావిస్తున్నా. ఆ గౌరవాన్ని స్వీకరించి సర్వీస్ చేస్తున్నా. మా నాన్నకి, గాడ్‌కీ సంగీతంతో సంగీతం చేస్తున్నా. 2.0కి పని చేసిన అనుభవం అనేది 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది. నాలో చాలా మార్పు వచ్చింది. నేను 3 ఏళ్లు ముందు వేరు., 2 ఏళ్ల ముందు వేరు. ఇప్పుడు వేరు. ఇందాకే చెప్పినట్టు గత రెండు నెలలుగా సినిమాలోని ఎఫెక్ట్స్‌ చూసినప్పుడు నా సంగీతం వాటి ముందు చాల్లేదనిపించింది. అందుకే ఇంకా కృషి చేశా. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ చాలా పెద్ద ఇన్‌స్పయిరింగ్‌ రోల్‌ చేశారు. సుభాష్‌ కరణ్‌గారు, రసూల్‌ పూకొట్టి, ఇంకా చాలా చాలా మంది కృషి చేశారు. ‘ఇందిర లోకం’ పాట రాసిన కీర్తిశేషులు ముత్తకుమార్‌కీ, మా అబ్బాయి ఎ.ఆర్‌.అమీన్‌కీ థాంక్స్‌” అని అన్నారు.

రసూల్‌ పూకొట్టి మాట్లాడుతూ ”శంకర్‌ నాకు ఫోన్‌ చేసి స్టోరీని నెరేట్ చేశారు. ఫ్లోర్‌ స్పేస్‌ సౌండ్‌ స్క్రీన్‌ నుంచి ఆడియన్స్‌ వరకు వెళ్లడాన్ని ఆయన వివరించారు. అదంతా విని నాకు వెన్నులో చలి మొదలైంది. ప్రపంచ సినిమాలో ఇలాంటిది చేయడం ఇదే తొలిసారి. రెండేళ్లు నేను, శంకర్‌ కలిసి పనిచేసి దీన్ని రియాలిటీకి తీసుకొచ్చాం. చాలా మంది మాకు సాయం చేశారు. సాఫ్ట్‌ వేర్ డెవలపర్స్‌ సాయం మర్చిపోలేం. ఎందరో మమ్మల్ని అలోగరిథమ్‌ ఆఫ్‌ సినిమా
ప్రొజెక్షన్‌ని రీరైట్‌ చేయడానికి అనుమతించారు. స జనకారుల ఆలోచనలను అంతే గొప్పగా అర్థం చేసుకునే నిర్మాత చాలా ముఖ్యం. నిర్మాతకు ధన్యవాదాలు. ఇండియన్ సినిమా స్టాల్వార్ట్స్‌ ఎందరో ఇక్కడున్నారు. ధ్వని విషయంలో చోటు చేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. కొత్త ఫార్మాట్‌కి సాక్షులు. త్రీడీ సౌండ్‌లో ఉన్న అన్నిటికన్నా అడ్వాన్స్డ్ లెవల్‌ ఇది. అలోగరిథమ్స్‌ మార్చి దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాం. ఈ ఫార్మాట్‌ వల్ల మూవీ మరింతగా ఆడియన్స్‌ మైండ్‌కి చేరుతుంది. ఇంత గొప్ప అచీవ్‌మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా టీమ్‌కి, లైకా టెక్నికల్‌ టీమ్‌కి ధన్యవాదాలు. ఇది తలైవర్‌ సినిమా” అని అన్నారు.

ROBO 2 MUSIC HIGHLIGHTS

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *