కూక‌ట్‌ప‌ల్లి కోర్ ఏరియాలో.. ఆర్క్ హేమా

కూక‌ట్‌ప‌ల్లి కోర్ ఏరియాలో.. గ్రీన్ టెర్రెస్ కాన్సెప్టుతో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి బ‌య్య‌ర్ల కోసం రూపుదిద్దుకుంటున్న స‌రికొత్త ల‌గ్జ‌రీ ప్రాజెక్టే.. ఆర్క్ హేమా. 1989 నుంచి నిర్మాణ రంగంలో పేరెన్నిక గ‌ల సంస్థ అయిన ఆర్క్ గ్రూప్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. హేమా అంటే బంగారమ‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌తిరోజు వేకువ‌జామునే టెర్ర‌స్ మీద సూర్యోద‌యం, ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు, స్వ‌చ్ఛ‌మైన గాలి, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం.. ఇలా మీకు బంగారంలాంటి జీవ‌నాన్ని అందించ‌డానికి రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టే.. ఆర్క్ హేమా. స్ట్రాట‌జిక్ లొకేష‌న్‌లో నిర్మించ‌డం వ‌ల్ల ప్ర‌తిరోజు హైటెక్ సిటీ, కొండాపూర్‌, గ‌చ్చిబౌలి వంటి ప్రాంతాల‌కు సులువుగా రాక‌పోక‌ల‌ను సాగించ‌వ‌చ్చు. అదేవిధంగా, మియాపూర్‌, బాచుప‌ల్లి, కొంప‌ల్లి, షామీర్‌పేట్, సికింద్రాబాద్‌ల‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. అంటే, అటు ఐటీ నిపుణుల‌కే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్‌, ఎడ్యుకేష‌న‌ల్ రంగాల్లో ప‌నిచేసేవారికి ఆర్క్ హేమా అమితంగా న‌చ్చుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులో నివ‌సించాల‌ని కోరుకునేవారికి ఇట్టే ఆర్క్ హేమా న‌ప్పుతుంది. ఎందుకంటే, మార్కెట్లోని ఇత‌ర ప్రాజెక్టుల‌తో పోల్చితే ధ‌ర అందుబాటులో ఉంది. పైగా, అభివృద్ధికి ఎంతో ఆస్కార‌మున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మిత‌మ‌వుతోంది.

నిత్యం మ‌ధ్య‌త‌ర‌గ‌తి బ‌య్య‌ర్ల‌కు ల‌గ్జ‌రీ స‌దుపాయాల‌ను అందించ‌డం మీదే దృష్టి సారించే ఆర్క్ గ్రూప్‌.. రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ల విస్తీర్ణాన్ని 999 చ‌ద‌ర‌పు అడుగుల నుంచి 1201 చ‌ద‌ర‌పు అడుగుల దాకా ప్లాన్ చేసింది. త్రీ బెడ్‌రూం ఫ్లాట్ల‌ను 1280 నుంచి 1710 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తోంది. గేటెడ్ క‌మ్యూనిటీలోని క్ల‌బ్‌హౌజ్‌, స్విమ్మింగ్ పూల్ వంటి మోడ్ర‌న్ ఫెసిలిటీస్ కావాల‌ని కోరుకునేవారికి అమితంగా న‌ప్పుతుందీ ప్రాజెక్టు. నిర్మాణం నాణ్య‌త ఎప్ప‌టిలాగే ప్రీమియంగా ఉంటుంది. డిజైన‌ర్ ల్యాండ్ స్కేపింగ్‌, అద్భుత‌మైన వెంటిలేష‌న్‌, ఏసీ జిమ్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ హాల్‌, చిల్డ్ర‌న్స్ ప్లేఏరియా, యోగా స్పేస్‌, స్నూక‌ర్‌, గ్రీన్ టెర్రెస్, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక కోర్టు వంటివి అంద‌జేస్తుంది.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *