ఓటుబ్యాంకుగా చూసినంత కాలం అభివృద్ధి ఉండదు

As long as the vote bank does not develop

  • అనంతపురం కరువుపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడి
  • తన పోటీపై జనవరి లేదా ఫిబ్రవరిలో చెబుతానని వ్యాఖ్య

రాజకీయ నాయకులు ప్రజలను కేవలం ఓటుబ్యాంకుగా పరిగణిస్తున్నారని, ఈ పరిస్థితి మారనంత కాలం అభివృద్ధి ఎప్పటికీ జరగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అనంతపురం ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని వివరించారు. అయితే గతంలో ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రైతులకు ఏమాత్రం ఉపయోగపడలేదని విమర్శించారు. నీళ్లు లేక కనీసం ఒక్క ఎకరం కూడా తడవలేదని రైతులే తెలిపారన్నారు. ‘రెయిన్‌ గన్ల వల్ల ఎంతో మందికి కమీషన్లు మాత్రం దక్కాయి. అయితే రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు జాతీయ మీడియాను నమ్మించారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న వెతలను కప్పిపుచ్చి భ్రమలు కల్పిస్తున్నారు. ఇలాంటి రైతులందరికీ జనసేన మద్దతు తెలుపుతోంది. ఓ దశాబ్దంపాటు ఈ ప్రాంతంపై సరైన ప్రణాళిక లేకపోతే అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయే ప్రమాదముందని వాతావరణశాఖ గతంలో హెచ్చరించింది. చేనేత కార్మికుల బాధలు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. దీని పరిష్కారం కోసం దీర్ఘకాలిక పరిష్కారం కోసం జనసేన ఆలోచిస్తోంది’ అని తెలిపారు. జిల్లాలోని యువత ప్రతిభ పక్క రాష్ట్రాలకు, విదేశాలకు ఉపయోగపడుతోందని, అలాంటివారిని ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పైనా విమర్శలు చేశారు. ‘జగన్‌ అసెంబ్లీకి వెళ్లరు.. అనంతపురం కరవు గురించి ప్రశ్నించరు. పార్టీలు మారటానికి జనసేన వ్యతిరేకమే. కానీ కానీ, దాన్నే సాకుగా చూపి అసెంబ్లీకి వెళ్లకపోవడం సబబు కాదు. ప్రతిపక్షానికి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో అనంతపురం కరవు గురించి మాట్లాడాలి. వలసల గురించి మాట్లాడాలి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొని తిట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. జనసేన పార్టీని తాము గుర్తించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జగన్ గుర్తించనంత మాత్రాన తమకు గుర్తింపు లేనట్టు కాదన్నారు. కాగా, తాను ఎక్కడి నుంచి పోటీ చేసేదీ జనవరి లేదా ఫిబ్రవరిలోగా తెలియజేస్తానని పవన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Buy Moto One Power For Lowest price Click Here

Buy latest Nokia Phones Here>>

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *