ఏవీ హైమా రెసిడెన్సీ @ తార్నాకా

హైద‌రాబాద్‌లోని హార్ట్ ఆఫ్ ద సిటీలో  ఉండాల‌ని చాలామంది కోరుకుంటారు. కానీ, కొంద‌రికే ఆ అవ‌కాశం ద‌క్కుతుంది. స్థ‌లాల కొర‌త విప‌రీతంగా ఉండ‌టం వ‌ల్ల న‌గ‌రం న‌డిమ‌ధ్య‌లో కొత్త  ప్రాజెక్టుల‌ను ప్రారంభించే  డెవ‌ల‌ప‌ర్లు త‌క్కువుంటారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఆరంభించినా, పిచ్చుక‌గూళ్ల మాదిరిగా క‌డ‌తారు. కానీ, తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష్ ప్రౌడ్ మెంబ‌ర్ అయిన ఏవీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ మాత్రం అందుకు పూర్తిగా భిన్న‌మ‌ని చెప్పాలి. కొనుగోలుదారుల‌కు నాణ్య‌మైన గృహాలు, వారికి ఆధునిక స‌దుపాయాల‌ను అందించ‌డం మీదే అధిక దృష్టి సారించే ఏవీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ తాజాగా తార్నాకాలో ఏవీ హైమా రెసిడెన్సీ అనే బ్యూటీఫుల్ ల‌గ్జ‌రీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ అనుమ‌తి తీసుకుని ఈ ప్రాజెక్టును సంస్థ ప్రారంభించింది. హండ్రెడ్ ప‌ర్సంట్ వాస్తు సూత్రాల‌కు అనుగుణంగా ప్రారంభ‌మైన ప్రాజెక్టే.. ఏవీ హైమా రెసిడెన్సీ ఎట్ తార్నాకా.

ఒక్కో అంత‌స్తుల ప‌ది ఫ్లాట్లు చొప్పున మొత్తం యాభై ఫ్లాట్ల‌ను ఇందులో నిర్మిస్తోంది. ఫ్లాట్ల విస్తీర్ణం 1225 నుంచి 1830 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఇందులో వ‌చ్చేవ‌న్నీ ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లే. ప్ర‌తి ఫ్లాట్ ఒక వ్య‌క్తిగ‌త గృహం ఉండేలా డిజైన్ చేశారు. రోజంతా క‌ష్టించి ప‌ని చేసి.. ప్రాజెక్టు ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించ‌గానే ప్ర‌శాంత‌మైన అనుభూతి క‌లిగే విధంగా ఏవీ హైమా రెసిడెన్సీని తీర్చిదిద్దారు. ఇందులో నివ‌సించేవారి కోసం ప్ర‌త్యేకంగా అమెనిటీస్ పొందుప‌ర్చింది. జిమ్‌, చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియా, బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేపింగ్‌, జాగింగ్ ట్రాక్‌, ఇండోర్ గేమ్స్ వంటివి పొందుప‌రిచారు. ఇక‌, ఇందులో నివసించేవారి భ‌ద్ర‌త కోసం ప్రత్యేక చ‌ర్య‌ల‌ను తీసుకున్నారు. సెక్యూరిటీ నియమించుకోవ‌డంతో బాటు 24 గంట‌లు ప‌ని చేసే సీసీ టీవీల‌ను అమ‌రిచారు. రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ పిట్స్‌, ధారాళ‌మైన వెలుతురు వ‌చ్చేలా, కామ‌న్ వాల్స్ అనేవి లేకుండా తీర్చిదిద్దారు. ఇందులో నివ‌సించేవారు ఫిట్‌నెస్ కోసం చింతించ‌క్క‌ర్లేదు. ఇందులోని జాగింగ్ ట్రాక్‌, ఆహ్లాద‌క‌ర ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని జాగ్ చేసేందుకు ప్రోత్స‌హించేలా ఉంటాయి. ఇక స్పెసిఫికేష‌న్స్ విష‌యంలో ఏమాత్రం రాజీప‌డ‌లేదు. మెయిన్ డోర్లు, విండోలు, స్టెయిర్‌కేస్, కారిడార్‌, టైల్స్ క్లాడింగ్‌, కిచెన్, ఎలక్ట్రిక‌ల్‌, ప్లంబింగ్‌.. ఇలా ప్ర‌తిఒక్క అంశంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపెట్టారు.

ఏవీ హైమా రెసిడెన్సీ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. మొద‌టి ద‌శ‌లో ప్రారంభం కానున్న హైద‌రాబాద్ మెట్రో రైలుకి చేరువ‌లో ఈ ప్రాజెక్టును చేప‌డుతుంది. ఇందులో కొన్న‌వారు.. అలా రోడ్డు మీదికొస్తే చాలు.. హ్యాపీగా సిటీ అంతా సుఖంగా ప్ర‌యాణం చేసే వీలు కలుగుతుంది. ఉప్ప‌ల్ స్టేడియం, జెన్‌ప్యాక్‌, ఆస్ప‌త్రులు, రెస్టారెంట్లు, స్కూళ్లు, కాలేజీలు వంటివ‌న్నీ ప్రాజెక్టుకి చేరువ‌లోనే ఉన్నాయి. మ‌రి, న‌గ‌రానికి న‌డిమ‌ధ్య‌లో నివ‌సించాల‌ని భావించేవారికి ఇంత‌కుమించిన త‌రుణం లేద‌నే చెప్పాలి. అందుకే, ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఏవీ హైమా రెసిడెన్సీలో ఫ్లాట్ గృహ‌ప్ర‌వేశం చేయండి.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *