ఆమ‌డ దూరంలో వైద్యం

ayushman bhava yojana
దేశ ప్ర‌ధానిని విమ‌ర్శించ‌డం కాదు కానీ స్మ‌రించాల్సిన నిజాలను విస్మ‌రించి, దాపెట్టి ఆయ‌న మాట్లాడుతున్నారు చూడండి అది క‌దా  సిసలు అబ‌ద్ధం.గ్రామీణ వైద్యంలో లోపాలు స‌రిదిద్ద‌క ఆయ‌న చేస్తున్న ప‌థ‌కాలు ఏమ‌న్నా ఫ‌లాలు ఇస్తాయా అన్న‌ది ఇప్ప‌టికీ అంతుపోల‌ని తోచ‌ని విష‌యం. ఆయుష్మాన్ భ‌వ‌.. ఈ ప‌థ‌కంతో యాభై కోట్ల మందికి ల‌బ్ధి అంటూ చెబుతున్నారు స‌రే అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణేదో చెబితే బాగుండు.
గుండె, మూత్ర‌పిండాలు, కాలేయ‌, మధుమేహ సంబంధిత వ్యాధుల‌కు ఈ ప‌థ‌కం కింద చికిత్స అందిస్తార‌ట‌. 1300 పైగా రుగ్మ‌త‌ల‌కు వైద్యం అందించ‌డ‌మే ఈ ప‌థ‌కం ధ్యేయం అన్న‌ది ప్ర‌ధాని వారి ఉవాచ‌. ప్ర‌పంచానికే ఆద‌ర్మంగా నిలిచే ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల‌కు ఆరోగ్య కార్డులు అంద‌జేయ‌డంతో పాటు టోల్ ఫ్రీ నంబ‌ర్ ఒక‌టి ఏర్పాటుచేసి అన్ని వివ‌రాలూ అందులో అందుబాటులో ఉంచుతాం.. ఇలా అమాత్యులు చెబుతున్నారు. బాగానే ఉంది ఇప్ప‌టికీ ఓ పీహెచ్సీ కనీస వ‌స‌తుల‌కు నోచుకోని సంద‌ర్భాలే కోకొల్ల‌లుగా ఉన్నప్పుడు స‌మ‌స్య‌లెలా తీర‌తాయ‌ని.
ఈ ప‌థ‌కం ద్వారా పేదలెవ్వ‌రూ ఆస్ప‌త్రుల‌కు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండ‌ద‌ని, గోల్డెన్ కార్డుతో న‌గ‌దు ర‌హిత చికిత్స‌లు పొంద‌వ‌చ్చ‌ని ఒక‌వేళ ఆ కార్డు లేక‌పోతే బొట‌న‌వేలితో  ముందుగా గుర్తించిన 13 వేల ఆస్ప‌త్రుల్లో సేవ‌లు అందుకోవ‌చ్చ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీన‌డ్డా తెలిపారు.
Details Of ayushman bhava yojana,Public Needs Detailes Of Modi Health Yojana,ayushman bhava scheme updates,will use ayushman bhava scheme to public,telugu latest news,tsnews breaking news,health updates,pm modi latest updates,modi ayushman bhava yojana news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *