ఆ ఒక్కటే అడగొద్దు .. బాబు ఫైనల్ డెసిషన్

Babu Final Decision

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పటానికి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. మహాకూటమి పొత్తులతో కలిసొచ్చే పార్టీలతో గులాబీ పార్టీ కి చెక్ పెతాలని చూస్తున్న బాబు టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసన తెలుగు తమ్ముళ్ళను బాబు తప్పని సరి పరిస్థితి కాబట్టి ఎవరూ సీట్ల గురించి పట్టించుకోకుండా మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చెయ్యాలని చెప్పారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో చంద్ర‌బాబు తో నేతలు తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారని తెలుస్తుంది . ఇక ఇప్ప‌టికే మహాకూట‌మిలో భాగమైన‌.. టీటీడీపీ నేత‌లు 17 సీట్లు వ‌ర‌కు కోరుతుండ‌గా కాంగ్రెస్ 14 సీట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. ఈ విషయంలో కాస్త అసంతృప్తి తో ఉన్న టీడీపీ నేతలు బాబు వద్ద ఈ అంశాన్ని ప్ర‌స్తావించ‌గా.. ఆయ‌న‌ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశార‌ని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఫైన‌ల్ జాబితా వ‌స్తుంద‌ని.. అభ్య‌ర్ధుల పేర్ల పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న చెప్పిన చంద్రబాబు మ‌హాకూట‌మిలో 14 కంటే ఎక్కువ సీట్లు కోరితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు.
దీంతో టీఆర్ఎస్ ఓట‌మే మ‌న ల‌క్ష్య‌మ‌ని చంద్రబాబు తెలుగు తమ్ముళ్ళకు స్ప‌ష్టం చేశార‌ని టాక్. దీంతో ఎవ‌రైనా అసంతృప్తులు ఉంటే తాను మాట్లాడ‌తాన‌ని సీట్లు విష‌యం మాత్రం అడ‌గొద్ద‌ని ఇదే ఫైన‌ల్ అంటూ చంద్ర‌బాబు స‌మావేశాన్ని ముగించి వెళ్ళిపోయారు. . దీంతో తెలుగు త‌మ్ముళ్ళు ఆ ఒక్క‌టే అడ‌గొద్దు.. ఇదే ఫైన‌ల్ అంటున్న చంద్ర‌బాబు మాటలు విని సైలెంట్ గా వెళ్ళిపోయారు తెలుగు తమ్ముళ్ళు.

Babu Final Decision, Chandrababu latest news, TDP Party News, Mahakutami Political news, Telugu news, Telugu breaking news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *