ఎన్నికల్లో బాలయ్య ప్రచారం … తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహం

bala krishna latest news

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒక వైపు తెరాస దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేసింది. మహాకూటమి పార్టీలు సీట్ల కేటాయింపు విషయంలో కిందా మీదా పడి ఇటీవలే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఇపుడిపుడే ఆ వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రతతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అన్న అంశం కీలకంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ప్రచార బాధ్యతలను బాలకృష్ణకు అప్పగించారట. ఈ నెల 25నుండి టీడీపీ ప్రచారం మొదలుకానుంది. ఈ ప్రచారంలో టీడీపీ అభ్యర్థుల తరఫున బాలయ్య ప్రచారం చేయబోతున్నాడట.

తెలంగాణ టీడీపీలో ప్రజాకర్షణ ఉన్న నాయకుడు ఎవరు లేరు అన్న కొరత బాలకృష్ణ రాకతో తీరబోతుంది. ఆ మధ్య లోకేశ్ ఈ బాధ్యతలను తీసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపించగా, గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా లోకేశ్ చేసిన ప్రచారాన్ని, దాని వల్ల టీడీపీ కి జరిగిన డ్యామేజ్ ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు నిర్మొహమాటంగా ప్రచారానికి లోకేశ్ ను పంపొద్దు అని బాబును కోరినట్టు తెలుస్తుంది. గత కొద్దీ కాలంగా కేంద్రం పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న బాలయ్య, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా అదే ఊపు కొనసాగిస్తారా?, బాలయ్య ప్రచారం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి ఎంతవరకు సాయపడుతుంది అన్నది వేచి చూడాలి.

bala krishna latest news,tdp leader bala krishna latest news,tdp mla bala krishna election compaigner in telangana,bala krishna latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *