రెండో రోజు కొన‌సాగిన తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు జైత్ర‌యాత్ర‌

Basketball championship competitions

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రాలో జ‌రుగుతున్న 45వ జాతీయ
బాస్కెట్ బాల్ ఛాంపియ‌న్‌షిప్ పోటీలు
* బీహార్‌, అస్సాం జ‌ట్ల‌ను చిత్తుచేసిన తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రాలో జ‌రుగుతున్న 45వ జాతీయ స‌బ్ జూనియ‌ర్‌ బాస్కెట్ బాల్ పోటీల్లో తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు రెండో రోజు త‌న స‌త్తాను చాటిచెప్పింది. మొద‌టి మ్యాచులో తెలంగాణ జ‌ట్టు బీహార్ ను 47-15 తేడాతో చిత్తు చేసింది. మ‌ధ్యాహ్నం జ‌రిగిన రెండో మ్యాచు పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది. తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో
అస్సాం జ‌ట్టును 65-10 తేడాతో చిత్తు చేసింది. రెండు మ్యాచుల్లోనూ తెలంగాణ బాలిక‌లు చక్కటి సమన్వయంతో రెండు రాష్ట్రాల‌ను మ‌ట్టి క‌రిపించారు. మొదటి క్వార్టర్ నుంచే మ్యాచ్‌పై పట్టు సాధించిన తెలంగాణ బాలికల జట్టు.. గ్రౌండ్‌లో చురుగ్గా కదులుతూ ప్రత్యర్థులను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ఈ గెలుపుతో తెలంగాణ స‌బ్ జూనియ‌ర్ బాలికల జట్టు ఎఫ్ పూల్‌లో అగ్రస్థానానికి చేరింది. నామ‌మాత్ర‌మైన చివ‌రి మ్యాచును తెలంగాణ జ‌ట్టు ఉత్త‌రాఖండ్‌తో త‌ల‌ప‌డుతుంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ బాస్కెట్ బాల్ ఫెడ‌రేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నార్మ‌న్ ఐజాక్ మాట్లాడుతూ.. ఈఏడాది తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు మెరుగ్గా రాణిస్తుంద‌న్నారు. కాంగ్రాకు వ‌చ్చే ముందు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కోచింగ్ క్యాంపులో బాలిక‌ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను అంద‌జేశామ‌న్నారు. దాన్ని ఫ‌లితంగానే సానుకూల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Basketball championship competitions,  Basketball championship competitions in HimachalPradesh , Kagra, Telangana Girls Team  2nd day match started, Bihar, Assam Teams , telugu news, telugu update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *