గెలుపుతో స‌త్తా చాటిన తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు

Basketball championship competitions

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రాలో..
* 45వ జాతీయ స‌బ్‌జూనియ‌ర్ బాస్కెట్ బాల్ ఛాంపియ‌న్‌షిప్ పోటీలు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రాలో సోమ‌వారం ప్రారంభ‌మైన 45వ జాతీయ స‌బ్ జూనియ‌ర్ బాస్కెట్‌బాల్ ఛాంపియ‌న్‌షిప్‌లో తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొట్ట‌మొద‌టి మ్యాచులోనే ప‌టిష్ఠ‌మైన చంఢీఘ‌డ్ జ‌ట్టును 37-30తో ఓడించింది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌మైన జ‌ట్టు అయిన‌ప్ప‌టికీ, తెలంగాణ బాలిక‌లు పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించి, స‌మ‌ష్ఠిగా రాణించ‌డం వ‌ల్ల విజ‌యాన్ని ద‌క్కించుకున్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు బీహార్, ఉత్త‌ర‌ఖండ్ వంటి జ‌ట్ల‌తో లీగ్ ద‌శ‌లో త‌ల‌ప‌డుతుంది. ఈసారి తెలంగాణ బాలిక‌ల జ‌ట్టు బ‌లంగా ఉంద‌ని తెలంగాణ బాస్కెట్‌బాల్ సెక్రెట‌రీ నార్మ‌న్ ఐజాక్ తెలిపారు. భార‌త‌దేశంలోని 24 రాష్ట్రాల నుంచి దాదాపు 600 బాస్కెట్ బాల్ క్రీడాకారులు, 200 మంది కోచ్‌లు, 100 రిఫ‌రీలు క్రీడాకారులు ఈ జాతీయ ఛాంపియ‌న్‌షిప్‌లో పాల్గొంటున్నారు. తెలంగాణ జ‌ట్టు త‌ర‌ఫున బాస్కెట్ బాల్ ఆడుతున్న‌వారిలో బాలిక‌ల జ‌ట్టులో రుచి అత్తెలి, జోషికా రెడ్డి, సానియా రాణా, రాగ‌మ‌యి రెడ్డి, గౌత‌మీ, భువ‌నేశ్వ‌రి, దీపికా, జాయిసీ ఇలియోరా, బృంద‌, లాస్య‌, శ్రీహిత‌, రియా లు ఉన్నారు.

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్లోని కాంగ్రాలో జ‌రుగుతున్న 45వ జాతీయ స‌బ్ జూనియ‌ర్ బాస్కెట్ బాల్ ఛాంపియ‌న్‌షిప్‌లో పాల్గొన‌డానికి తెలంగాణ బాలిక‌ల బృందం గ‌త శుక్ర‌వారం బ‌య‌ల్దేరి ఆదివారం ఉద‌యం చేరుకున్న‌ది. ఈ టోర్న‌మెంట్‌కు తెలంగాణ జ‌ట్టుకు కోచులుగా బాబా ర‌వీంద‌ర్, ప‌వ‌న్‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. రిఫ‌రీలుగా అశ్విన్ కుమార్, సోహైల్ ఖాన్‌, విక్ట‌ర్ రోణీ, విలాస్ రెడ్డి, వ‌ర్ద‌న్‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బాస్కెట్‌బాల్‌కు పూర్తి ప్రోత్సాహం: సీఎం జైరామ్ ఠాకూర్
బాస్కెట్ బాల్ ఆట‌కు పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తామ‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జైరామ్ ఠాకూర్ తెలిపారు. సోమ‌వారం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రా మున్సిప‌ల్ గ్రౌండ్‌లో 45వ జాతీయ స‌బ్ జూనియ‌ర్ బాస్కెట్‌బాల్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీల‌ను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో నిర్వ‌హిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బాస్కెట్‌బాల్ ఆడ‌టానికి విచ్చేసిన క్రీడాకారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి అనంత్ కుమార్ మృతి ప‌ట్ల తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల అనంత కుమార్ కుటుంబీల‌కు సానుభూతిని వ్య‌క్తం చేశారు. భార‌త బాస్కెట్‌బాల్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు, క‌ర్ణాట‌క ఎమ్మెల్సీ గోవింద్ రాజ్ మాట్లాడుతూ.. భ‌విష్య‌త్తులో భార‌త‌దేశం అంత‌ర్జాతీయ పోటీల్లో రాణించ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే క్రీడాకారుల్ని త‌యారు చేయాలంటే స‌బ్ జూనియ‌ర్ స్థాయిలోనే బాల‌బాలిక‌ల ప్ర‌తిభ‌ను గుర్తించాల‌న్నారు. అప్పుడే కామ‌న్వెల్త్‌, ఒలంపిక్స్ వంటి అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో రాణిస్తార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ బాస్కెట్‌బాల్ సెక్రెట‌రీ నార్మ‌న్ ఐజ‌క్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ఎక్క‌డ్లేని ప్రోత్సాహాన్ని అంద‌జేస్తోంద‌ని తెలిపారు.

Basketball championship competitions , Basketball championship competitions in HimachalPradesh , Telangana Basketball Girls Team , Won the Telangana Basketball Girls Team in HimachalPradesh

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *