ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థుల కోసం బీజేపీ పడిగాపులు

bjp party latest news

తెలంగాణ బిజెపికి  కొత్త సమస్య వచ్చి పడింది. అభ్యర్థుల విషయంలో ఉన్న చోట ఎక్కువ మంది ఆశావహులు వుండటం, లేదంటే అభ్యర్థులే లేకపోవటం బీజేపీ కి చిక్కులు తెచ్చి పెట్టింది. ఒక్కో నియోజకవర్గం లో అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఆదిలాబాద్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ మిగితా 6 నియోజక వర్గాలలో అభ్యర్థులకోసం వేట  సాగిస్తోంది. ఆ ఆరు నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులెవరు ? వేరే పార్టీల నుంచి వచ్చి చేరే అభ్యర్థుల కోసం పార్టీ ఎదురుచూస్తుందా? అంటే అవును అని చెప్పక తప్పని పరిస్థితి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ప్రచారంలో ముందజలో కొనసాగుతోంది. తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నయం అంటూ బిజెపి ఆర్భాటంగా ప్రకటిస్తున్నా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో  ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ , బోథ్ నియోజకవర్గానికి మడవి రాజు, బెల్లంపల్లిలో హేమాజీని, ముథోల్‌లో రమాదేవిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటిచింది . కాని మిగితా ఆరు నియోజకవర్గాలలో అభ్యర్థులెవరనేది ఇంకా తేలలేదు. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థులు యాబై రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే బిజెపి అభ్యర్థుల  ఎంపిక ఇంకా పూర్తికాకపోవడంతో పార్టీ కార్యకర్తలు అందోళన చెందుతున్నారు.

మంచిర్యాల, చెన్నూర్,ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నియోజకవర్గాలలో అభ్యర్థులేవరనేది  ప్రశ్నార్థకంగా మారింది. మంచిర్యాల నుండి ఎన్ ఆర్.ఐ. రఘు పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు . అదేవిదంగా  నిర్మల్ నియోజకవర్గంలో స్వర్ణరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాని మిగితా నాలుగు నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులు తప్ప ప్రజల్లో బలం ఉన్న నాయకులు కనిపించకపోవడం పార్టీకి  ఇబ్బందిగా మారింది. ఆసిఫాబాద్ లో రాంనాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఆయనకు అనుకున్నంత ఇమేజ్ లేదు . అదేవిదంగా సిర్పూర్‌ లో కూడ ఆ విధమైన పరిస్థితి ఉంది. ఖానాపూర్‌లో ఆదివాసీ నాయకుడు ప్రభాకర్ పోటిచేయడానికి  సిద్దంగా ఉన్నాపెద్దగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడంలేదు. పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం ఇబ్బందిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరకని అభ్యర్థులు బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత  బిజెపి అభ్యర్థులను ప్రకటిస్తుందని ప్రచారం సాగుతుండటం విశేషం.

సిర్పూర్ లో  కాంగ్రెస్ టికెట్ లభించకపోతే రావి శ్రీనివాస్  బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతున్నది. అదే విదంగా చెన్నూర్‌లో మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు  బిజెపి పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఖానాపూర్ లో సైతం బలమైనా ఆదివాసీ నాయకుడు కాంగ్రెస్‌లో టికెట్ రాకపోతే బిజెపి నుండి పోటి చేస్తారని బిజెపి వర్గాలు  అంటున్నాయి. బిజెపిలో చేరడానికి నాయకులు టచ్ లో ఉన్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు. అదే విదంగా ఉమ్మడి ఆదిలాబాద్ పది సీట్లలో పది విజయం సాదిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిజెపి.. అధికార పార్టీ ధీటుగా అభ్యర్థులను దింపాలని భావిస్తోంది. అదేవిదంగా పోటి ఇవ్వడమే కాకుండా వీలైనన్ని సీట్లలోనైనా విజయం సాధించాలనే  వ్యూహంతో బిజెపి యత్నిస్తుంది.

bjp party latest news,bjp party ls looking for mla candidates in adilabad,bjp party want 6 constituencymla candidates in adilabad

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *