బొడిగె శోభకు అనుచరులూ షాక్ ఇచ్చారా

bodiga shoba latest news

చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు ఆమె అనుచరులు కూడా షాక్ ఇచ్చారు. మొన్న టీఆర్ ఎస్, నిన్న బీజేపీ నేడు ఆమె అనుచర గానం ఇచ్చిన షాక్ కి శోభ కు దిక్కు తోచని స్థితి నెలకొంది.
 అందరికీ త్కెట్లు ఇచ్చిన కేసీఆర్ ఒక 14 స్థానాల్లో టికెట్లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. మొదటి జాబితాలో కేసీఆర్ శోభకు టిక్కెట్‌ ఇవ్వలేదు. దీంతో తనకు ఎలాగో టికెట్ రాదనే నమ్మకంతో ఆమె టీఆర్ఎస్‌ను వీడారు. దాదాపు రెండు నెలలుగా ఆమె రాజకీయ భవిష్యత్‌పై కమ్ముకున్న నీలి నీడలను భారతీయ జనతా పార్టీ చెరిపేసింది. ఆ పార్టీ తన మూడవ జాబితాలో బొడిగె శోభకు టికెట్‌ ఇవ్వడం ద్వారా ఆ సస్పెన్స్‌కు తెరదించింది. ఈ నెల 14న బీజేపీ పార్టీ తరపున నామినేషన్‌ వేశారు. దీంతో చాలా రోజులు టికెట్‌ పెండింగ్‌లో ఉంచిన సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌కు టికెట్‌ కేటాయించారు. మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులు రవిశంకర్‌కే ఉన్నాయని, ఆయనకు టిక్కెట్‌ ఖాయమని మొదటి నుంచి చెబుతూ వచ్చారు.

బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్‌ కూడా వేశారు. బీ-ఫారం ఇవ్వకపోయినా ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో తాజా జాబితాలో సుంకె రవిశంకర్‌కు చోటు కల్పించింది. ఇక బీజేపీలో చేరిన బొడిగే శోభకు చొప్పదండి స్థానం కేటాయించారన్న సంతోషం ఆదిలోనే ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే లిస్టు ప్రకటించలేదు. ఇన్ని రోజులూ తన వెన్నంటి ఉన్న అనుచరులు ఆమెకు షాక్ ఇచ్చారు. ఆమె వర్గంలో ఉన్న మండలంలోని పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నివాసంలో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సమావేశంలో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో మండలంలో టీఆర్‌ఎస్‌ రెండు గ్రూపులుగా ఉండేది. వీరిలో కొంతమంది ఎమ్మెల్యే వర్గంలో, మరికొంత మంది స్థానిక నేతలతో మరో వర్గంగా ఉండేవారు. మండలంలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు వర్గాల నేతలు వేర్వేరుగా నిర్వహించే వారు.  ఇప్పుడు శోభ పార్టీ మారటంతో అనుచరులు గులాబీ పార్టీ లోనే ఉంటామని శోభకు హ్యాండిచ్చి వెళ్ళిపోయారు.

bodiga shoba latest news,leaders gave shock to bodiga shoba,trs leader bodiga shoba latest news,trs ex mla bodiga shobha update news

Please Subscribe to My youtube channel TSNEWS CHANNEL

SUbscribe TO TSNEWS.TV

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *