బుట్టారేణుక పోటీ చేసేది ఎక్కడనుండో

కర్నూలు రాజకీయాల్లో బుట్టా రేణుక కు పొలిటీషియన్ గా మంచి పేరుంది. వైసీపీ నుండి ఎంపీగా ఎన్నికై టీడీపీ కి వచ్చిన బుట్టా రేణుక పార్టీ లో చేరిన రేణుక, వైసీపీలో ఉన్న సమయంలోనూ, ఇటు టీడీపీ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలో మంచి ఫేమ్ ఉన్న నాయకురాలు ఆమె. కర్నూలు ఎంపీగా ఉన్నరేణుక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశంఉన్నా ఎంపీగా టికెట్ దొరుకుతుందా అన్నది అనుమానమే.

జాతీయ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ప్రభావం చూపిస్తే రేణుకకు ఎంపీ టికెట్ విషయంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం వుంది. అదే జరిగితే ఈ స‌మ‌యంలో క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు కాంగ్రెస్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తో చిక్కుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో రేణుక ఎంపీగా పోటీ చెయ్యలేరు. కనుక ఇప్పటి నుండే రేణుక సీటు సర్దుబాటు పై దృష్టి పెటారు చంద్రబాబు. .

ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రేణుకను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు బాబు. కానీ ఆమెకు అనుకూలంగా ఉండే నియోజకవర్గం ఏది కూడా ఆమెకు ఆప్షన్ గా కనిపించటం లేదు. లేదు కోట్ల ను కాదని ఎంపీగా ఆమెకే టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటె కోట్ల ఫ్యామిలీ కి కూడా కర్నూలు లో చాలా ఫేమ్ వుంది. కోట్ల ఫ్యామిలీ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి పేరున్న ఫ్యామిలీ. ఆ కుటుంబం ఎంత చెబితే అంత. కేంద్ర‌మంత్రిగా పని చేసిన ఆయ‌నకు కాంగ్రెస్ త‌ర‌పున చ‌క్రం తిప్పిన సీమ నేత‌గా పేరు ఉంది.

అలాంటప్పుడు అక్కడ రేణుక కు ఆప్షన్ లేదు. ఇక ఎమ్మిగనూరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేకు స్థానికంగా బలం వుంది. ఆ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆమె కు తప్ప రేణుకకు ఇవ్వలేరు బాబు.అయితే అనూహ్యంగా ఆమెకు క‌ర్నూలు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎలా వుంటుంది అన్న దానిపై బాబు ఆలోచనలో ఉన్నారు. అసలు క‌ర్నూలు నుంచి ఎస్వీకి గానీ టీజీ కుమారుడికి గానీ టికెట్ ఇవ్వాలి. కానీ వారిలో వారికి పడక పోవటంతో వారిద్దరినీ పక్కన పెట్టి రేణుకకు ఇస్తే గెలుస్తుందా అని ఆలోచిస్తున్న బాబు ఆ కోణం లో సర్వే కూడా చేయిస్తున్నారని టాక్.

butta renuka latest news,kurnool mp butta renuka latest news,no mp ticket for butta renuka,tdp mp mutta renuka fighting for mp ticket in kurnool

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *