జ‌న‌సేన ల‌క్ష్యం ఏ వ‌ర్గం

Category of Janasena Party

ఏపీలో జ‌న‌సేనుడు దూకుడుపెంచాడు. పార్టీలోకి వ‌ల‌స‌లు మొద‌లు కావ‌డంతో శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ నేప‌థ్యంలో
జనసేన పార్టీ ఐదురోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ లో ‘జన తరంగం’ కార్యక్రమం చేపట్టనుంది. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా ఫేస్‌బుక్ ద్వారా ప్ర‌క‌టించారు. దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశం. నూతన రాజకీయాలకు ఇదో సరికొత్త మార్గం. జనసేన సైనికులు, యువత పార్టీ మేనిఫెస్టోను తీసుకుని ప్రతి ఇంటి తలుపు తట్టండి. జనసేన కార్యక్రమాలను వివరించండి. కులాలు, మతాలకు అతీతంగా జనసేన తెస్తున్న సరికొత్త రాజకీయాలను వివరించండి. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతిక సంవత్సరాల భవిష్యత్‌ను ఇవ్వడానికి జనసేన ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టండి. నేను కూడా పలువురు కుటుంబ సభ్యులతో మాట్లాడతా. ఐదురోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి. జనసేన ఆశయాలు, మేనిఫెస్టో, రాజకీయాలు ఎందుకు మారాలి? వంటి అంశాలను వివరించండి. ప్రజలను మమేకం చేయడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. మనస్ఫూర్తిగా విజయవంతం చేయండి. మీకు అండంగా ఉంటాం. బంగారు ఆంధ్రప్రదేశ్‌, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే దీనికి వెనుక ముఖ్య ఉద్దేశం.’’ అని ఫేస్‌బుక్‌లో పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ప‌వ‌న్ ఫేస్‌బుక్‌లో పెట్టిన సందేశం వెనుక మిగ‌తా పార్టీలు ఆందోళ‌న చెందుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం కాపుల‌నే ల‌క్ష్యం చేసిన‌ట్టు అంద‌రూ ఊహించారు. ఈ మేర‌కు త‌మ పార్టీలో ఉన్న కాపు నేత‌లు చేజార‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కానిప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా యువ‌త వైపు ద‌`ష్టిపెట్ట‌డంతో ప్ర‌ధాన‌పార్టీలు ఖంగుతిన్నాయి. జ‌న‌సేనుడి ల‌క్ష్యం మ‌రో వైపు కేంద్రీక‌రించ‌డంతో మిగ‌తాపార్టీలు యువ‌కులు చేజారిపోకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు నెల‌ల మిగిలి ఉండ‌టంతో జ‌న‌సేన మెల్లిగా పావులు క‌దుపుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి వ‌ర్గాల వారిగా పార్టీ బ‌లంపెంచేందుకు ప‌వ‌న్ అనుస‌రిస్తున్న తీరు ప్ర‌ధాన‌పార్టీల అధిష్ఠానం నాయ‌కుల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టించేలాఉన్నాయ‌ని వారు చెబుతున్నారు.

Category of Janasena Party , AP latest News, Janasena Party Pavan kalyan Latest news, AP Political news, telugu  news, Telugu Update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *