మాల్యా కేసులో సీబీఐ పొరబాటు

CBI Error In Mallya Case

విజయ్‌ మాల్యా కేసుకు సంబంధించి 2015లో జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ లో అదుపులోకి తీసుకోండి అన్న పదానికి బదులు మాకు సమాచారం ఇవ్వండని మార్చడం తమ నిర్ణయంలో జరిగిన పొరపాటని సీబీఐ పేర్కొంది. మొదటి లుక్ ఔట్ నోటీస్ జారీ చేసినపుడు అంటే 2015 అక్టోబర్ 12 నోటీసులో మాల్యాని అదుపులోకి తీసుకొమ్మని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ను కోరారు. అయితే అపుడు మాల్యా విదేశాల్లో ఉన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చాక… మాల్యాను అదుపులోకి తీసుకోవాలా వద్దా అంటూ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సీబీఐని కోరింది. మాల్యా రాజ్యసభ ఎంపీ కావడం, అతనిపై ఎలాంటి వారంట్ లేకపోవడంతో  మాల్యాని అరెస్ట్ లేదా అదుపులోకి తీసుకోవాల్సిన పనిలేదని సీబీఐ పేర్కొంది.  అయితే 2015 నవంబర్ లో మరో లుక్ ఔట్ నోటీసులును సీబీఐ జారీ చేసింది. అయితే ఇందులో మాల్యా కదలికల సమాచారం మాత్రం తెలపాలంటూ ఎయిర్ పోర్ట్ అధికారులను కోరారు. అంటే పాత సర్క్యలర్ లో ఉన్న అరెస్ట్ లేదా అదుపులోకి తీసుకోండి… అన్న పదానికి బదులు సమాచారం ఇవ్వండనే పదం వాడారు. దర్యాప్తుకు సహకరిస్తున్నందున సీబీఐ ఈ నోటీసులో మార్పులు చేసింది. నిబంధనల ప్రకారం సీబీఐ మళ్ళీ చెబితే గాని సదరు వ్యక్తిని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ లేదా అదుపులోకి తీసుకోరు. మొదటి నోటీసు తరవాత మూడుసార్లు విచారణకు హాజరైనందున తాము తదుపరి నోటీసులో మార్పులు చేసినట్లు సీబీఐ అంటోంది.

changing Look Out Circular In Mallya Case,CBI Wrong wrong Information To Immigration,Vijay Mallya Case,CBI Error In Immigration Form,Telugu Updates,Mallya Case Updates,CBI Mistakes In Mallya,Immigration Cont Arrest Mallya Reason?

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *