కొలకనూరి ఇనాక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Central Sahitya Akademi Award for Kolakanoori Inak

2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 24 భాషల్లో సాహిత్య రచనలకు గానూ ఈ అవార్డులు ప్రకటించింది. ప్రముఖ రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు.
ఇనాక్ రచించిన తెలుగు సాహిత్య పుస్తకం ‘విమర్శిని’కి ఈ అవార్డు లభించింది. 2019 జనవరి 29న ఢిల్లీలో ఈ అవార్డును కొలకలూరి ఇనాక్ అందుకోనున్నారు. అలాగే భాషా సమ్మన్ అవార్డుకు ప్రొఫెసర్ జి. వెంకటసుబ్బయ్య ఎంపికయ్యారు.
ఇప్పటికే ఆయన పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. కొలకలూరి ఇనాక్‌ 1954లో ‘లోకంపోకడ’, ‘ఉత్తరం’ అనే కథానికల ద్వారా తెలుగు సాహితీ లోకంలో ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఆచార్య కొలకలూరి ఇనాక్ 1939 జూలై ఒకటిన గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా కూడా పనిచేశారు. 2014లో భారత ప్రభుత్వం ఇనాక్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈయన రచనలలో ద గిఫ్ట్ ఆఫ్ ఫర్ గివ్నెస్, మోర్ ప్రసిద్ధి చెందాయి.

Central Sahitya Akademi Award for Kolakanoori Inak , Kolakanoori Inak latest news, 24 languages , Delhi latest news, Telugu latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *