బెంగ‌ళూరుకు బాబు

Chandrababu

దీపావ‌ళి త‌రువాత బాబులో కొత్త వెలుగులు వ‌స్తున్నాయి
బీజేపీ కి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ్ అన్న సంకేతాలు ఇటీవ‌ల ఫ‌లితాలు
రూఢీ చేయ‌డంతో ఆయ‌న మోడీతో ఢీ కి సై అంటున్నారు
టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఖ‌రార‌యిన ద‌రిమిలా ఆయ‌న చర్య‌లు వేగ‌వంతం అయ్యాయి.

క‌ర్ణాట‌క ఫ‌లితాలు కాంగ్రెస్ – జేడీఎస్ కూట‌మికి అనుకూలంగా ఉండ‌డంతో బాబు అండ్ కో లో ఆనందం వెల్లువెత్తుతోంది. శివ‌మొగ్గ లోక‌సభ స్థానం మిన‌గా ఉప ఎన్నిక‌లు జ‌రిగిన అన్ని స్థానాల‌నూ కూట‌మి కైవ‌సం చేసుకోవ‌డం బీజేపీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యింది.ఈ సారి మూడు లోక్ స‌భ స్థానాల‌కు, రెండు అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాండ్య బ‌ళ్లారి స్థానాలను జేడీఎస్‌, కాంగ్రెస్ గెలుకున్న సంగ‌తి విధిత‌మే.శివ‌మొగ్గ ఒక్కటే బీజేపీ ఖాతాలో ప‌డింది. ఈ పరిణామాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కుమార స్వామి జేడీఎస్ బాస్ దేవెగౌడల‌ను క‌లుసుకునేందుకు చంద్ర‌బాబు బెంగ‌ళూరుకు వెళ్ల‌నున్నారు. బీజేపీ శ‌క్తుల‌ను ఓడించేందుకు ఈ సారి దేశ వ్యాప్తంగా కొత్త శ‌క్తుల కూడిక బిజీ బిజీగా ఉన్న బాబు ఆ దిశ‌గా ఏ మేర‌కు స‌ఫ‌లీకృతుల‌వుతారో అన్న‌ది ఇప్పుడిక కీల‌కం. అదేవిధంగా త‌మిళ‌నాట కూడా బాబు డీఎంకే అధినేత‌ల‌ను క‌లుసుకోవాల‌ని య‌త్నిస్తున్నారు. ఫ‌రుక్, ములాయం, మాయ వంటి నేత‌ల‌ను క‌లుపుకుని పోతున్న నారా చంద్ర‌బాబు నాయుడు ముందున్న కాలంలో మ‌రికొన్ని శ‌క్తుల ఏకీక‌ర‌ణ‌లో ఏ మేర‌కు స‌ఫ‌లీకృతం అవుతారో అన్న‌ది వేచి చూడాలి.

Chandrababu , TDP Party News, Chandrababu Update news, Congress , TDP , Karnataka Congress Results, Telugu Latest News, Telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *