విప‌క్షం అంతా ఒకే తాటిపేనే.

Chandrababu Latest News
ఎన్నిక‌లు ప్రజాస్వామ్యం  పార్టీలు ఈ ట్ర‌యాల‌జీలో పార్టీలు ప్ర‌జాస్వామ్యాన్ని బ‌తికిస్తాయ‌ని అంటాయి. ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య విధానానికి ఓ ఆలంబ‌న అని సంబంధిత వ్య‌వ‌స్థ చెబుతుంది. ప్ర‌జాస్వామ్య దేశాన ఏది ఓడినా గెలిచినా అంతిమంగా దాని ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పైనే.. కానీ ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని కాపాడాల‌ని త‌హ‌త‌హ‌లాడే నాయ‌కులు ఆ వ్య‌వ‌స్థ‌ని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారు. రాజ‌కీయం పేరిట నీతిమాలిన కొన్ని బంధాలు పొత్తుల పేరిట నెల‌కొల్పుతారు. ఈ దేశాన ఇంకా ప్ర‌జాస్వామ్యం ఉంది దానిని మేం ర‌క్షిస్తాం అని ఎవ్వ‌రు చెప్పినా హాస్యాస్ప‌ద‌మే. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ తో వైరిని కొన‌సాగించిన టీడీపీ ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డం కాస్త ఆశ్చ‌ర్య‌మే.త‌మ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు నేతృత్వాన ఆ పొత్తు సాగుతుండ‌డం తెలుగుదేశం శ్రేణులు కాస్త విస్మ‌యంలో ఉన్నా ఆయ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే దిశ‌లో లేరు. ఈ ద‌శ‌లో రానున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ ఆంధ్రాలో తెలుగుదేశం కాంగ్రెస్ చెట్ట‌ప‌ట్టాల్ వేసుకుని తిరిగి, తిరిగి అధికారంలోకి రానున్నాయ‌న్న మాట‌. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ పొత్తు ఓ చారిత్రక అవ‌స‌రం అన్న‌ట్లు మాట్లాడిన నేత‌లే ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు ఓ చారిత్ర‌క అవ‌స‌రం అన్న‌ట్లు అదే పాట పాడుతుండ‌డం విస్మ‌యానికి
గురిచేసే అంశం.రాహుల్ నాయ‌క‌త్వం బ‌ల‌ప‌డే దిశ‌గా ఇవాళ ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంద‌ని అనుకోలేం. బీజేపీని ఢీ కొనే శ‌క్తి కాంగ్రెస్ కు ఉంద‌ని ఈ సారి మోడీని గ‌ద్దె దించ‌డ‌మే ధ్యేయ‌మ‌ని చెప్ప‌డంలో రాహుల్ బాబు స‌క్సెస్ కావొచ్చు కానీ ఆ పాటి  స్థాయిలో ప్ర‌జ‌లంతా అర్థం చేసుకుంటారా లేదా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.
Chandrababu Latest News, Tdp Latest News, Telugu News, AP Political News , AP Latest News, Telangana Latest News , Telugu Breaking News, AP cm Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *