బాబు తో దోస్తీపై కేవీపీ ఏమంటారో?

Chandrababu latest news

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ అధికార పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్కటయ్యారు. కలిసి రాజకీయాల్లో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ లోని కాంగ్రెస్ పార్టీ కి ఈ బంధం ఇబ్బందిని కలిగిస్తుంది. మొదట నుండి ఉప్పు నిప్పులా ఉన్న ఇరు పార్టీలు కలిసి పని చెయ్యాలంటే కాంగ్రెస్ నేతలకు మాత్రం రుచించటం లేదు. నిన్నా మొన్నటి దాకా ఒకరంటే ఒకరికి గిట్టని నాయకులు ఒక్క సారిగా జాతీయ రాజకీయాల్లో జర్గిన మార్పును ఆహ్వానిమ్చాలేకపోతున్నారు. నిన్నామొన్నటి దాకా తితుకున్న వాళ్ళు ఇప్పుడు భ్జాలు కలిపి నడవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు అంటేనే తమ ఆగర్భ శత్రువు అన్నట్టు చూసిన నాయకులు ఇప్పుడు బాబు చూపిన మార్గంలో నడవాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. కరడుగట్టిన టీడీపీ వ్యతిరేఖులు టీడీపీ తో కలిసి నడవాలంటే నరకమే అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ లో కొందరు సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది.
ఏపీ కాంగ్రెస్ నేతలు రాజకీయ జీవితంలో ఏ పార్టీతో అయితే.. సుదీర్ఘ కాలంగా పోరాడారో ఇప్పుడా పార్టీతోనే కలసి పనిచేయాల్సి వస్తుంది. ఊహించని విధంగా రాహుల్ గాంధీ తో చంద్రబాబు స్నేహం వారిని షాక్ కు గురి చేసింది. ఏపీలో పార్టీ ఉనికి కోల్పోయినా పార్టీ మీద ఉన్న అభిమానంతో పార్టీ లో నేటికీ కొనసాగుతున్న నాయకులు పార్టీ ని వీడి వెళ్ళలేక, ఉండలేక నానా యాతన అనుభవిస్తున్నారు. చంద్రబాబునాయుడు అంటేనే గిట్టని కేవీపీ, రఘువీరా వంటి నాయకులకు ఇది కంటకంగా మారింది. బాబు వ్యతిరేకులుగా ఉన్న ఆ వర్గం ఇప్పుడు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు తో కలిసి నడుస్తున్నారన్న వార్తతో అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు. వైఎస్ హయాంలో రాజకీయంగా ఉన్నతంగా బతికి గత ఎన్నికల దెబ్బతో చివరికి ఎటూ కాకుండా సైలెంట్ గా ఉన్నా ఆ నేతలు కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు. మరి అలాంటి వాళ్లు చంద్రబాబు కనుసన్నల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. కలిసి ప్రయాణం చెయ్యాలంటే ససేమిరా అంటున్నారు. కానీ అధిష్టాన నిర్ణయాన్ని పాటించాలి. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి.
ముఖ్యంగా అందరికీ గాడ్ ఫాదర్ అయిన కేవీపీ ముఖ్యంగా ఈ మైత్రి పట్ల నిరసనతో ఉన్నారు. ఆయన మాట విని నడిచే పీసీసీ చీఫ్ రఘువీరా కూడా చాలా బాధలో ఉన్నారు. జగన్ పార్టీ లో చేరకున్నా జగన్ మీద ఏ రోజూ ఒక్క మాట కూడా మాట్లాడని కేవీపీ తెలుగుదేశం పార్టీపై మాత్రం ఒంటికాలితో లేచేవారు. టీడీపీ ని ఎప్పుడూ టార్గెట్ చేసే కేవీపీ ఇప్పుడు టీడీపీ తో కలిసి ఎలా పని చేస్తారనేది లక్షల డాలర్ల ప్రశ్న. ఎప్పుడు ఏ కాష్ట అవకాశం దొరికినా టీడీపీ ని టార్గెట్ చేసే ఆయన బాబు కు బద్ధ శత్రువు. ఇప్పుడు ప్రతీ దానికి బాబు చెప్పిన బాటలో నడవాల్సిన స్థితి వచ్చింది. ఈ సమయంలో కేవీపీ తో పాటు ఆయన అనుచర గణం అయిన బాబు వ్యతిరేకుల దారేది అనేది ఆలోచించాల్సిన అంశమే.

Chandrababu latest news, KVP news on Chandrababu friendship, Chandrababu friends with congress, telugu news, telugu news update , AP latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *