టీఆర్ఎస్‌లా కాకూడదని చంద్రబాబు కొత్త ప్లాన్

Chandrababu New Plan
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఆరు నెలల తర్వాత జరగబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ హడావిడి పెరిగిపోతోంది. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికే జై కొట్టిన ఏపీ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఈ ఫలితాలనే మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకోసం ఇప్పటి నుంచే ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేసిన టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీపైన పోరాటానికి దిగింది. విభజన హామీల విషయంలో ఏపీకి అన్యాయం చేసిందనే కారణంతో ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చేసింది ఆ పార్టీ. అటు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ, ఇటు ప్రతిపక్షాల నుంచి ఎదురౌతున్న ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్లేలా చంద్రబాబు ప్లాన్లు చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన ఎన్నికలపైనా ఓ కన్నేసి ఉంచారు. తాజాగా రాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు.
ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన టీడీపీ అధినేత.. తాజాగా మరో విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదేమిటంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలందరినీ విడుతల వారీగా పిలిచి వారితో సమావేశమవడం. ఇలా ఇప్పటి నుంచే వారితో మాట్లాడి అభ్యర్థుల ప్రకటన నాటికి అసంతృప్తి లేకుండా చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎదురైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. దీంతో ఆ పార్టీలో అలజడి మొదలైంది. టికెట్ ఆశించి భంగపడిన చాలా మంది నేతలు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇంకొంత మంది వారి బాటలో పయనిస్తుండగా, మరికొంతమంది రెబెల్స్‌గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే పరిస్థితి ఏపీ రిపీట్ కాకూడదని భావించే చంద్రబాబు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. టీడీపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

Chandrababu New Plan , Chandrababu Political News, Elections Time , AP Latest News, TDP party latest News,Telugu News, Telugu News Update

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *