బాబు కనుసన్నల్లో కాంగ్రెస్

Chandrababu Political News

  • తెలంగాణ ఎన్నికల్లో కర్త, కర్మ, క్రియా అన్నీ ఆయనే
  • అభ్యర్థుల ఎంపిక నుంచి వ్యూహాల దాకా బాబు చెప్పిందే వేదం
  • ఇదీ టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి

ఒకప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. ఇప్పుడు అదే పార్టీని దాదాపు శాసిస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి ప్రభంజననం సృష్టించగా.. ఇప్పుడు టీడీపీ అధినేత కాంగ్రెస్ తో అంటకాగుతూ మరో చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి నిజం చేస్తూ.. హస్తం పార్టీతో కలిసి చంద్రబాబు ముందుకెళుతున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, తన అవసరాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ తో జతకట్టారు. తెలంగాణలో పొత్తుతో మొదలైన వారి బంధం.. క్రమంగా బలపడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు.. ఈసారి కాంగ్రెస్ తో కలసి ఎన్నికల సమరంలో దిగుతున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో కలసి వేదిక పంచుకున్న చంద్రబాబు.. అనంతరం మహాకూటమి ఏర్పాటులో తెరవెనుక మంత్రాంగం నడిపి విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీచేస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వామపక్షాలను, కొత్తగా ఏర్పడిన తెలంగాణ జనసమితిని తమతో కలుపుకుని కూటమిగా ఏర్పడితే అంత సమస్య ఉండదని భావించి, ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. అయితే, కూటమికి సీపీఎం దూరంగా ఉండగా.. సీపీఐ, టీజేఎస్ లు సై అన్నాయి. ఇక సీట్ల సర్దుబాటులో టీజేఎస్, సీపీఐ సైతం గట్టిగానే స్థానాలు అడగ్గా.. టీడీపీ చాలా మెతక వైఖరి అవలంభించింది. తమకు భారీగా సీట్లు అవసరం లేదని, పది నుంచి 12 సరిపోతాయని పేర్కొంది. సహజంగానే ఇది రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి కలిగించింది. కాంగ్రెస్ తో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తున్న కారణంగానే చంద్రబాబు తెలంగాణలో సీట్ల విషయంలో మెతక వైఖరి అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీ కాంగ్రెస్ కు అన్నీ ఆయనే అయి వ్యవహరించడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అంతా తానై ముందుకు నడిపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం చంద్రబాబు సూచనలకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను చెప్పినట్టు ముందుకు వెళితే అధికారం మనదేనని బాబు చెబుతున్నట్టు తెలుస్తోంది. కేవలం కాంగ్రెస్, టీడీపీలు కలిసి కూటమిలోని ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని అంటున్నట్టు సమాచారం. తాను సూచించిన అభ్యర్థులను కాంగ్రెస్ రంగంలోకి దింపితే కనీసం 55 స్థానాలు గెలుస్తామని, తమ పార్టీ కనీసం 9 స్థానాలు కైవసం చేసుకుంటుందని, తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని రాహుల్  కు వివరించినట్టు తెలిసింది. ఇందుకు రాహుల్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే, తమకు హోంశాఖతో పాటు రెండు మూడు కీలక మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని అడిగినట్టు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతల్లో కొందరికి ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు. తమపై బాబు పెత్తనం

Chandrababu Political News , AP CM Chandrababu Latest News, . AP Latest News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *