చంద్రబాబు ఐకాన్ అన్న వైసీపీ మాజీ ఎంపీ

జగన్ పై దాడి జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు వైసీపీ నాయకులు టీడీపీ మీద చంద్రబాబు మీద మాటల దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కడప వైసీపీ మాజీ ఎంపీ చంద్రబాబు పై షాకింగ్ కామెంట్ చేసి అందర్నీ షాక్ కు గురి చేశారు. చంద్రబాబు ఐకాన్ అని చెప్పారు.

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగితే.. క‌నీస మాన‌వ‌త్వం లేకుండా జ‌గ‌న్ పై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేయ‌డం చాలా దారుణ‌మ‌ని అవినాష్ రెడ్డి అన్నారు. 40 ఏళ్ళ రాజ‌కీయ అనుభవం అని డబ్బా కొట్టుకునే చంద్ర‌బాబు నిజంగానే ఐకాన్ అని.. అయితే ఆయన అవినీతిలో ఐకాన్‌ అని అవినాష్ రెడ్డి మండి ప‌డ్డారు. రాజధానిలో భూములు దోచుకున్నారని అన్నారు. త‌న కుట్ర‌లో భాగంగా తునిలో రైలును తగులబెట్టించి.. ఆ నెపాన్ని కడప జిల్లా ప్రజలపై మోపిన చంద్ర‌బాబుకు.. ఇప్పుడు కడపలో అడుగుపెట్టే అర్హత లేద‌ని అవినాష్ మండిపడ్డారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తూ ఇప్పుడు ధ‌ర్మ పోరాట దీక్ష‌లంటూ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి డ్రామాలు ఆడుతున్నార‌ని అవినాష్ రెడ్డి తెలిపారు. వ‌ర్షాలు లేక‌ కడప జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో చంద్ర‌బాబు ఒక్క‌మాట కూడా ఎందుకు మాట్లాడ‌లేద‌ని అవినాష్ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి.. చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌కి త‌డిసిపోతుంద‌ని దారుణమైన వ్యాఖ్య చేశారు. ఆప‌రేషన్ గ‌రుడ అంటూ కుట్ర‌కు తెర లేపార‌ని అవినాష్ ద్వ‌జ‌మెత్తారు. మ‌రి అవినాష్ రెడ్డి వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు అంతే ఘాటుగా సమాధానం ఇస్తారో లేదో వేచి చూడాలి.

cm chandrababu latest news,ycp mp avinash reddy sensational comments on cm chandrababu naidu,chandrababu is a icon says ycp mp avinash reddy

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *