అందరికీ 11న బీ ఫామ్స్ ఇవ్వనున్న కేసీఆర్ … అభ్యర్థుల మార్పు లేనట్టే

cm kcr latest news

టీఆర్ఎస్  అధినేత కేసీఆర్ అసెంబ్లీ  రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అదే రోజు జంబో లిస్టు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే అప్పుడు అది సంచలనం అయ్యింది. అయితే లిస్టు లో పేర్లు మారతాయని బీ ఫాం ఇచ్చే దాకా గ్యారెంటీ లేదని ప్రచారం నడిచింది. కొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తారని జరుగుతున్న ప్రచారానికి రేపటితో  ఫుల్ స్టాప్ పెట్టేయనున్నారు గులాబీ బాస్ . పార్టీ తరపున ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు ఆదివారమే బీఫామ్స్ పంపిణీ చేయబోతున్నారు. దీని కోసం అందరూ అందుబాటులో ఉండాలని వారికి కాల్ చేసి మరీ చెప్పారు.

ఎన్నిక‌ల నోటిఫికేషన్ కు ఒక‌రోజు ముందే బీ-ఫామ్ లు ఇవ్వాల‌ని నిర్ణయించిన గులాబీ బాస్  ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో అభ్యర్థుల‌తో సమావేశం నిర్వహించిన అనంత‌రం కేసీఆర్ సంత‌కం చేసి మ‌రి బీ-ఫామ్ లు అంద‌జేయ‌నున్నారు. గ‌త సెప్టెంబ‌ర్ 6న అభ్యర్థుల‌ను ప్రక‌టించిన ద‌గ్గర‌ నుంచి ఇప్పటివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థుల ప్రచార శైలి పై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. బీ-ఫామ్ ఇచ్చే ముందు తెలంగాణ భ‌వ‌న్ లో వారితో ప్రత్యేకంగా సమావేశమై.. కొన్ని సూచనలు చేయబోతున్నారు. అలాగే ఇప్పటివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి..అభ్యర్థుల ప్ర‌చార‌శైలి…గెలుపు ఓట‌మిల‌పై పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ అభ్యర్థుల నుంచే మ‌రోసారి సేక‌రించ‌నున్నారు. ఊహించిన దానికి భిన్నంగా కేసీఆర్ ఈ సారి నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల మీద స్థానికంగా వ్యతిరేఖత ఉన్నా కూడా అభ్యర్థుల మార్పు పై గులాబీ బాస్ దృష్టి పెట్టటం లేదు.

మ‌రోవైపు పార్టీ ప్రక‌టించని 12నియోజ‌క‌వ‌ర్గల అభ్యర్థుల‌ను కూడా… ఇప్పటికే ఖరారు చేశారు. అందరితో పాటే వారికీ… బీ ఫామ్స్ ఇవ్వబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొత్తం 119నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్థుల‌కు 11నే బీ-ఫామ్ లు అందించబోతున్నారని తెలుస్తుంది.

ఇక గులాబీ బాస్ కేసీఆర్ గ‌జ్వెల్ నుంచి ఈ నెల 15 న నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే గులాబీ బాస్, అదృష్ట సంఖ్య 6 నే నానినేషన్ కు ఫాలో అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నిక‌ల్లో నామినేష‌న్ ముందు సిద్ది పేట‌ నియోజ‌క‌వ‌ర్గంలోని కోనాయ‌ప‌ల్లి వెంక‌టేశ్వర స్వామి ద‌ర్శనం అనంత‌రం నామినేష‌న్ దాఖ‌లు చేశారు కెసీఆర్. ఈ సారి కూడ కోనాయ‌ప‌ల్లిలో ద‌ర్శనం చేసుకొని నామినేష‌న్ వేసేందుకు అట్టహాసంగా బ‌య‌లుదేరతార‌ని తెలుస్తోంది. మొత్తానికి ప్లాన్ ప్రకారం నోటిఫికేషన్ కంటే ముందే బీ ఫాం లను ఇచ్చి ఎవర్నీ మార్చకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నిజంగా షాకింగ్ .

cm kcr latest news,telangana cm kcr update news,kcr giving b forms on november 11,telangana cm kcr giving b forms to leaders on novermber 11

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *