మార్కెట్లోకి కోమియో ఎక్స్ ఒన్ మోడ‌ల్

Comio X1 Features
– లాంఛ‌నంగా ప్రారంభించిన ఆర్ ఎస్ ఎం
– వేడుక‌గా డీల‌ర్స్ మీట్
–  అతి త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్ ఫోన్లు
శ్రీ‌కాకుళం జిల్లా మార్కెట్లోకి కోమియో ఎక్స్ ఒన్ మొబైల్స్‌ను ప్ర‌వేశపెడుతున్నామ‌ని కంపెనీ రీజ‌న‌ల్ సేల్స్ మేనేజ‌ర్ రాధా కిషన్ తెలిపారు. ఇవి అతి త‌క్కువ ధ‌ర‌కే ల‌భ్య‌మై అత్యంత నాణ్య‌మైన సేవ‌లు అందిస్తాయ‌ని చెప్పారు. స్థానికంగా ఓ ప్రైవేటు హోట‌ల్ లో మంగ‌ళ‌వారం జిల్లా స్థాయి డీల‌ర్ల స‌మావేశాన్ని వేడుక‌గా నిర్వ‌హించారు.తొలి మొబైల్ ను  సిటీ ప్లాజా నానాజీ అందుకున్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
కోమియో కంపెనీ మొబైళ్లు 5300 రూపాయ‌ల ద‌గ్గ‌ర నుంచి ప‌ది వేల రూపాయ‌ల దాకా ల‌భ్య‌మ‌వుతున్నాయని, వీటిలో అనేకానేక ఫీచ‌ర్లు అందుబాటులో ఉంటాయ‌ని వివరించారు.అతి త‌క్కువ ధ‌ర‌కే ఈ  స్మార్ట్ ఫోన్   ను త‌మ కంపెనీ అందిస్తోంద‌ని అన్నారు. మొత్తంగా ఐదు మోడ‌ళ్ల‌లో ఈ స్మార్ట్ ఫోన్ల‌ను మార్కెట్లోకి ప్ర‌వేశ పెడుతున్నార‌ని , గుర్తింపు పొందిన అన్ని మొబైల్ షాపుల్లో ఎస్.ఆర్.ఎంట‌ర్ ప్రైజెస్ అధినేత బూర్లె ఉమామ‌హేశ్వ‌ర‌రావు తెలిపారు. ఇప్ప‌టికే స్థానిక చిన‌బ‌రాటం వీధిలో స‌ర్వీస్ సెంట‌ర్ ను సైతం నెల‌కొల్పామ‌ని వెల్ల‌డించారు.ఏపీలో రెండో సారి నిర్వ‌హించిన ఈ డీల‌ర్స్ మీట్‌కు అనూహ్య స్పంద‌న లభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.అనంత‌రం డీల‌ర్ల‌కు ఎస్ఆర్ ఎంట‌ర్‌ప్రైజెస్ త‌ర‌ఫున జ్ఞాపిక‌లు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో కంపెనీ ప్ర‌తినిధి చ‌లం,ప‌లువురు డీల‌ర్లు, రిటైల‌ర్లు పాల్గొన్నారు.
Comio X1 Features,Comio X1 Price, Comio X1 Updates, New Mobiles, Latest Mobiles, Public Review,Mobile Market

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *