కాంగ్రెస్ స్థానం టీడీపీకి ఇవ్వద్దని గాంధీ భవన్ వద్ద ఇద్దరి ఆత్మహత్యా యత్నం

Congress Latest News

ప్రజా కూటమిలో అసమ్మతి రగులుకుంది. ఇప్పటికే ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి అసమ్మతి నేతలు చెమటలు పట్టిస్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అనుచరులు గాంధీభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బిక్షపతి అనుచరులిద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజాకూటమి లోని పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా టీడీపీకి శేరిలింగంపల్లి స్థానాన్ని కేటాయించారు. అయితే ఆ సీటును టీడీపీ కి కేటాయించవద్దని కోరుతూ గాంధీభవన్ ఎదుట బిక్షపతి వర్గీయులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ కే టికెట్ కేటాయించాలని బిక్షపతి డిమాండ్ చేస్తున్నారు.శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్‌కే కేటాయించాలని గాంధీ భవన్ ఎదుట బిక్షపతి అనుచరులు ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. మరో కార్యకర్త తన చేయిని కోసుకొన్నాడు.వీరిద్దరిని అడ్డుకున్నారు అక్కడే ఉన్న నాయకులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటం తో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్‌ పార్టీకే ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానం నుండి హామీ ఇవ్వాలని గాంధీభవన్‌లో బైఠాయింఛి ఆందోళన చేశారు భిక్షపతి వర్గీయులు. ఇంకా లిస్టు బయటకు రాకముందే పరిస్థితి ఇలా వుంటే బయటకు వచ్చాక పరిస్థితి ఎలా వుంటుందో అన్న టెన్షన్ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని భయపెడుతుంది.

Both the suicide attempts at the Gandhi Bavan ,Congress Latest News, Latest news in congress party, tdp latest news, telugu news update, telugu breaking news, tdp political news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *