అసంతృప్తులను బుజ్జగిస్తున్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్

Congress Leader DK Shiva Kumar

మహాకూటమి పొత్తుల వాళ్ళ సీట్లు కోల్పోయిన ఆశావహులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగించనుంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని కూడ ఏర్పాటు చేసింది.మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు కారణంగానో లేదా సామాజిక సమీకరణాల నేపథ్యంలోనో ఇతరత్రా కారణాలతోనో టికెట్లు దక్కని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బుజ్జగిస్తోంది.

* అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఛైర్మెన్‌గా ముగ్గురితో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కృష్ణారావుతో పాటు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చోటు కల్పించింది. ఇప్పటికే ఈ కమిటీ సభ్యులు హైద్రాబాద్‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ కమిటీ సభ్యులను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలు కలిశారు. తనకు టికెట్టు కేటాయింపు విషయమై జరిగిన అన్యాయంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి కమిటీ ముందు వివరించారు. మరోవైపు బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇంకా ఎక్కువ స్థానాలు కేటాయించాలని కమిటీ సభ్యులను కోరినట్టు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. టికెట్ల కేటాయింపులో జరిగిన లోటుపాట్లను సరిదిద్దాలని కోరినట్టు లక్ష్మయ్య మీడియాకు చెప్పారు. మరో వైపు వరంగల్ వెస్ట్ సీటును ఆశించి ఆ సీటు దక్కకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కూడ ఈ కమిటీ సభ్యులను కలుసుకొన్నారు. వరంగల్ వెస్ట్ స్థానం టీడీపీకి కేటాయించింది. టీడీపీ అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు.

Congress Leader DK Shiva Kumar , Congress update news , Karnataka Minister DK Shiva kumar , Hyderabad , Ex Minister Ponnala , MLC Pongulati sudhakar

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *