హస్తం నేతల జాబితా టెన్షన్

Congress leaders in tension

టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోటానికి మహాకూటమి మాత్రం ప్రయత్నం చేస్తుంది. మహాకూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి రాకపోవటం తో కాంగ్రెస్ ముందు వివాదం లేని స్థానాలలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే వారు ప్రచారానికి వెళతారని భావిస్తుంది. అందుకే ఈ రోజు జాబితా ప్రకటనకు సన్నాహాలు చేస్తుంది మహాకూటమి. కాంగ్రెస్ ప్రకటించే జాబితాపై కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించిన వారిలో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుంది ఎవరికి నిరాశ మిగులుతుంది అనేది ఈరోజు తెలిసే అవకాశం వుంది. ఒకపక్క టీఆర్ఎస్ కూడా ఈ ముహూర్తానికే ఎదురు చూస్తుంది. అయితే జాబితాలో కొందరికి షాక్ తగలనుంది అన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపధ్యంలో పార్టీలోనూ అంతర్గత చర్చ జరుగుతుంది.
వెంట‌నే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి తెలంగాణ‌లో జోరుగా ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన కాంగ్రెస్ ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హుటా హుటిని ఢిల్లీకి వెళ్లి లిస్ పై అధిష్టానంతో కసరత్తు చేశారు.కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ష‌బ్బీర్ అలీ, జానారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క వీరంతా కాంగ్రెస్ సీనియ‌ర్ జాతీయ నేత ఏకే అంటోనితో స‌మావేశ‌మై తుది జాబితాను సిద్ధం చేశార‌ని చెబుతున్నారు. మ‌హాకూట‌మిలో మిగ‌తా పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌ను మిన‌హాయించి మిగిలిన స్థానాల్లో పోటీప‌డుతున్న అభ్య‌ర్థులను ప‌రిశీలించి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం తుది జాబితాను ఓకే చేసింది.
కాంగ్రెస్ నుంచి టికెట్‌ని ఆశిస్తున్న వారు 15 నుంచి 20 నియోజ‌క వ‌ర్గాల్లో అత్య‌ధికులు పోటీప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ కూటమి కోసం 29 స్థానల వరకు త్యాగం చేస్తుంది. ఈ స్థానాల్ని మిన‌హాయించి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం తొలి ద‌ఫా 70 నుంచి 75 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌డానికి ఈరోజే ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్ప‌టికే టిక్కెట్లు ద‌క్కే ప‌లువురి పేర్ల‌ను కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారంలోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 41 పేర్లు విస్త్ర‌తంగా ప్ర‌చారంలో ఉన్నాయి. ఈ లిస్టులో కొంద‌రికి ఊహించ‌ని షాక్ త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారంజోరుగా సాగుతుంది. అలాగే ఊహాతీతంగా కొన్ని కొత్త పేర్లు తెర‌పైకి రానున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. మరి ఈరోజు ప్రకటించే జాబితాతో కాంగ్రెస్ ప్రచారంలో ముందుకు సాగుతుందా లేదా అనేది తెలియాల్సి వుంది. మరి ఈరోజు ప్రకటించే జాబితాలో కూటమి నుండి కాంగ్రెస్ టికెట్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో షాక్ కు గురయ్యే వారెవరో మరి కొన్ని గంటల్లో తేలనుంది.

The list of Congress leaders in tension , Mahakutami latest News, Congress Party News ,  Telugu News, Telugu breaking News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *